ఏపీ రాజకీయాల్లో శనివారం నాడు కూటమి ప్రభుత్వంలో ఒక అనూహ్య పరిణామం చోటు చేసుకుంది.ప్రస్తుతం అది ఒక హాట్ టాపిక్ గా మారింది.కడప జిల్లా మైదుకూరు బహిరంగ సభ వేదిక మీద కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు అయినా శ్రీనివాస్ రెడ్డి గారు ఇచ్చిన ప్రసంగంలో ప్రధానంగా తెలుగుదేశంపార్టీకి సంబంధించి లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలంటూ డిమాండ్ చేస్తూ కీలకమైన వ్యాఖ్యలు చేసారు.ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు కూటమి సమీకరణాలు,రాజకీయ స్థితి ఆధారంగా ఉత్కంఠను పెంచాయి.టిడిపి అధినేత చంద్రబాబునాయుడికి అనుబంధంగా లోకేష్ను రాజకీయ వ్యవహారాల్లో మరింత ప్రాముఖ్యంగా చూడాలని శ్రీనివాస్ రెడ్డి అంటూ,లోకేష్ యువతపై ప్రభావం చూపించగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నారని ఆయన ప్రశంసించారు.ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు కూటమి కార్యకర్తలు,నాయకులు మరియు విశ్లేషకుల మధ్య చర్చలకు దారితీస్తూనే యువ నాయకత్వంపై మరింత దృష్టిని పెంచుతాయి,ఇది లోకేష్‌కు రాజకీయ బలాన్ని ఇచ్చే అవకాశం కల్పించవచ్చు.

ఈ వ్యాఖ్యలతో డిప్యూటీ సీఎం వంటి కీలక రాజకీయ హోదా ఉన్న పదవి కూటమి పార్టీల మధ్య విభేదాలను తెచ్చిపెట్టే అవకాశం ఉంది. జనసేన కార్యకర్తలు లేదా నాయకులు ఈ అంశంపై సున్నితంగా స్పందించే అవకాశం ఉంది.పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన కార్యకర్తలు, ఈ వ్యాఖ్యలను టీడీపీ అధిక ప్రాధాన్యానికి సంకేతంగా భావిస్తే, అది కూటమి సౌభ్రాతృత్వంపై ప్రతికూలంగా ఉండవచ్చు.ఈ వ్యాఖ్యలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తమకు అనుకూలంగా ఉపయోగించుకునే అవకాశం ఉంది. వారు కూటమి ఐక్యత లేదా లోకేష్ నాయకత్వంపై విమర్శలు చేయడానికి ఇదొక ఛాన్స్ గా తీసుకుంటారు.

అయితే శ్రీనివాస్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వీకరిస్తారా? లేదంటే పవన్ కళ్యాణ్ విని వినినట్లు కూటమి నాయకత్వం తరపున తమకు తాము ఈ వ్యాఖ్యలను అనుకూలంగా మలుచుకోవడంలో విజయవంతమవుతుందా అనే చూడాలి.అయితే గతంలో మహాసేన యువత రాజేష్‌ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేసాడని తెల్సిందే.అయితే వాళ్ళు కావాలని అంటున్నారా లేదా యాద్రుచ్చికంగా జరుగుతుందా అనేది ప్రస్తుతం జనసేన మరియు బీజేపీ నేతల్లో ఒక ప్రశ్నర్ధకంగా మారింది. అయితే తాజాగా జరిగిన ఈ వ్యాఖ్యలపై  చంద్రబాబు స్పందించకపోతే కూటమి మనుగడ ప్రశ్నర్ధకంగా మారుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: