పవన్ కళ్యాణ్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై మొదటి దశలో 15 చిత్రాలు నిర్మించాలనే ఒప్పందం కుదుర్చుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. అందుకే తమ బ్యానర్లో వచ్చిన సినిమాలు పవన్ కళ్యాణ్ కు అనుకూలంగానే ఉంటాయట.. అయితే 2024 ఎన్నికలలో కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ నుంచి పోటీ చేయాలనుకున్నారట విశ్వప్రసాద్..అయితే కూటమిలో ఒప్పందంలో భాగంగా ఆ సీటు బిజెపి పార్టీకి వెళ్లిందట. కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత టీజీ విశ్వప్రసాద్ గ్రాండ్ పార్టీ కూడా ఇచ్చారట. అలా పవన్ కళ్యాణ్ పార్ట్నర్ గా అవ్వడం వల్ల అందుకే కోట్ల విలువైన భూమిని కూడా ఇప్పుడు గిఫ్ట్ గా ఇచ్చారనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి.
పీపుల్ టెక్నాలజీ, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, పీఎంఎఫ్ టూర్స్ అండ్ ట్రావెల్స్, బీజోన్ హాస్పిటల్ ఇలా ఇతరత్రా వాటిలో వ్యాపారాలు అనుభవం ఉన్నప్పటికీ తాజాగా ఇప్పుడు ఈ మెబిలిటీ పార్కుతో పాటుగా ఈ స్కూటర్ల తయారీ యూనిట్ ఉన్న సైతం ఏర్పాటు చేసేందుకు ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నారట. తైవాన్, చైనా, కొరియా వంటి దేశాలకు చెందిన కంపెనీలతో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలియజేశారు. ఇందుకు 2100 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టే ఆర్థిక పరిస్థితి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ కు లేదు. అందుకే ఏపీ ఈడీబీ పీపుల్స్ గ్రూపుతో ఒప్పందం కుదుర్చుకున్నారట.
హైదరాబాద్ బెంగళూరు వంటి పారిశ్రామిక క్యారీడర్లో భాగంగా ఓర్వకల్లు లో కూడా అలాంటి అభివృద్ధి జరగాలని 2,621 ఎకరాల భూమిని సైతం రాష్ట్ర ప్రభుత్వం ఇయ్యాలని నిర్ణయించుకుందట. ఆ తర్వాత 1200 ఎకరాలలో ఈ మెబిలిటీ పార్కును సైతం ఏర్పాటు చేయడానికి ఒప్పందం కుదుర్చుకొని అనంతరం ఆ కాగితాలతో నిర్మాత విశ్వప్రసాద్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని కలుస్తూ ఆశీర్వాదం పొందడంతో ఇప్పుడు చర్చనీ అంశంగా మారింది. ఇప్పుడు అక్కడ ఎకరా భూమి భూమి కోటి రూపాయల వరకు పైగా ఉన్నట్లు సమాచారం.