ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో... ప్రస్తుతం కూటమి సర్కార్ అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ ప్రభుత్వం ఏర్పాటు అయి ఏడాది కాలం కూడా పూర్తి కాలేదు. కానీ అప్పుడే కూటమిలో నేతల మధ్య... సమన్వయం ఆలోచిస్తోంది. ముఖ్యంగా జనసేన వర్సెస్ తెలుగుదేశం పార్టీ నేతల మధ్య... గొడవలు తారస్థాయికి చేరుతున్నాయి. స్వయంగా డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలోని.. టిడిపి అలాగే జనసేన మధ్య అసలు పడదు.


పచ్చి గడ్డి వేస్తే భగ్గు మనేలా రెండు పార్టీల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇక ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పోస్ట్ కి ఈసారి పెట్టారు టిడిపి నేతలు. కొత్తగా ఏపీలో... డిప్యూటీ ముఖ్యమంత్రిగా నారా లోకేష్ ను నియామకం చేయాలని తెలుగు తమ్ముళ్లు డిమాండ్ చేస్తున్నారు. పార్టీ మీటింగ్ లోనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు నేతలు. ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే... పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పదవికి టీడీపీ ఎసరుపెట్టినట్లు అందరూ చర్చించుకుంటున్నారు.

రాజకీయ విశ్లేషకులు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అటు టీడీపీ కింది స్థాయి లీడర్లు కూడా ఇదే డిమాండ్‌ వినిపిస్తున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం గా నారా లోకేష్‌ ఉండాలని అంటున్నారు.  నారా లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలంటూ డిమాండ్  ఊపందుకుంటోంది.  తిరుపతి తొక్కిసలాట ఘటనపై ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కామెంట్స్ పై టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడును ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గట్టిగానే వాయించారు.


దీంతో.. పవన్ కు వ్యతిరేకంగా టీడీపీ పార్టీ నేతలు మాట్లాడుతున్నారు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వతంత్రంగా వ్యవహరిస్తున్నారనే...ప్లాన్డ్ గా లోకేష్ కు డిప్యూటీ సీఎం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారట టీడీపీ పార్టీ నేతలు.  లోకేష్ ను డిప్యూటీ సీఎంను చేస్తేనే యువతకు భరోసా ఉంటుందని పవన్ కు చురకలు అంటిస్తున్నారట.  టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాస్ రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు... ఏపీ రాజకీయల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. మరి దీనిపై కూటమి అధిష్టానం ఎలా రియాక్ట్‌ అవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: