తెలంగాణ రాష్ట్రంలో కూడా టీడీపీ పార్టీని మళ్లీ పరుడు పోయాలని తెలుగు తమ్ముళ్లు భావిస్తున్నారు. అటు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌ కూడా అదే ధోరణితో ముందుకు వెళుతున్నారు. ఇప్పటికే చంద్రబాబు దీనిపై ప్రకటన చేయగా.. తాజాగా ఏపీ మంత్రి నారా లోకేష్‌ కూడా... తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ పార్టీ రీ - ఎంట్రీపై సంచలన ప్రకటన చేశారు. తాజాగా సీనియర్‌ ఎన్టీఆర్‌ 29వ వర్ధంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ పార్టీ రీ - ఎంట్రీపై కీలక వ్యాఖ్యలు చేశారు ఏపీ మంత్రి నారా లోకేష్‌.


తెలంగాణలో టీడీపీ పై ప్రజలకు ఎంతో ప్రేమ ఉందని గుర్తు చేశారు. అందుకు ఉదాహరణ స్వచ్చందంగా లక్షా 60 వేల సభ్యత్వాలు ప్రజలు తీసుకోవడమన్నారు. ఇప్పుడు ఎలాంటి ఎమ్మెల్యేలు లేకుండా ఇంత మంది సభ్యత్వం తీసుకున్నారని గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో తెలంగాణ లో కూడా పార్టీ కార్యకలాపాలు ప్రారంభిస్తామని వెల్లడించారు. ఎన్టీఆర్‌ స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రంలో ముందుకు వెళతామన్నారు ఏపీ మంత్రి నారా లోకేష్‌.



ఎన్టీఆర్ కేవలం మూడు అక్షరాలు కాదు.. అదొక్క ప్రభంజనం అన్నారు. సినీ రంగంలో అన్ని రకాల సినిమాలు తీసి.. ఆయన మార్క్ పెట్టారని తెలిపారు ఏపీ మంత్రి నారా లోకేష్‌. రాజకీయాల్లో కూడా ఎన్నో సేవలు అందించాడని... రెండు రూపాయలకే బియ్యం అందించాడని వివరించారు. మహిళలకు ఆస్తిలో హక్కు కల్పించిన గొప్ప వ్యక్తి అని... తెలుగు వాళ్ళని మద్రాసీలు అనేవారని తెలిపారు ఏపీ మంత్రి నారా లోకేష్‌. వాళ్ళందరికీ తెలుగు వరమని గర్వంగా చెప్పుకునేలా చేశారని స్పష్టం చేశారు.


ఆయన ఏ ఆశయాలతో పార్టీని పెట్టారో మాకు తెలుసు అని.. ఆయన ఆశయాలతో పార్టీ నీ ముందుకు తీసుకెళతామని వివరించారు. ఏదైనా తప్పు జరిగితే.. దానిని సరిదిద్దడానికి కూడా పార్టీలో పెద్దలు అన్నారన్నారు ఏపీ మంత్రి నారా లోకేష్‌. ఇక ఏపీ మంత్రి నారా లోకేష్‌... తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ పార్టీ రీ - ఎంట్రీపై మాట్లాడటంతో.... తెలుగు తమ్ముళ్లలో ఉత్సాహం వచ్చింది. దీంతో.. తెలంగాణ రాష్ట్రంలో  ఏపీ మంత్రి నారా లోకేష్‌ పాదయాత్ర చేయాలని.. డిమాండ్‌ చేస్తున్నారు నేతలు.

మరింత సమాచారం తెలుసుకోండి: