గుర్తుతెలియని వ్యక్తులు పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయం పైన డ్రోన్లు ఎగురవేశారు మధ్యాహ్నం సమయంలో ఈ డ్రోన్లు ఎగురు వేయడంతో ఒక్కసారిగా సిబ్బంది అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని వెంటనే భద్రత దృష్టికి తీసుకువెళ్లారట. మంగళగిరిలో జనసేన పవన్ కళ్యాణ్ క్యాంపు ఆఫీస్ పైన ఈ డ్రోన్ ఎగరవేసినట్లు అక్కడ సిబ్బంది గుర్తించారు. వెంటనే ఈ సిబ్బంది సమాచారం పవన్ కళ్యాణ్ కి కూడా అందించారట.
డిప్యూటీ సీఎం గా ఉన్న వ్యక్తికి , పార్టీ కార్యాలయానికి సంబంధించి అనుమతి లేకుండా డ్రోన్లు ఎగరవేయడం ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ భద్రత దృష్టిలోపం అన్నట్లుగా అభిమానులు వాపోతున్నారు. మరి ఆ డ్రోన్ ఎవరు ఎగిరేసారు? పొరపాటున వచ్చిందా లేకపోతే ఇతర ఏదైనా కారణాలు ఉన్నాయా అనే విషయం ఇంకా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారట. అంతేకాకుండా గత కొద్ది రోజుల క్రితం జనసేన పార్టీ క్యాంపు కార్యాలయంలో కూడా గుర్తు తెలియని వ్యక్తి మెసేజ్లు అసభ్యకరంగా పంపించడంతో ఒక్కసారిగా కలకలాన్ని సృష్టించింది. ఆ తర్వాత నకిలీ పోలీస్ అధికారి కూడా విజయనగరం పర్యటనలో తెగ హల్చల్ చేశారు. ఇప్పుడు డ్రోన్ పవన్ కళ్యాణ్ కార్యాలయం పైన ఎగరవేయడంతో ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ ప్రాణహాని కలిగించేందుకు సంకేతాలు అంటూ అభిమానులు తెలుపుతున్నారు. మరి వీటి పైన పవన్ కళ్యాణ్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.