ఇక ఈరోజు ఎన్డీఆర్ఎఫ్ భవనాలను ప్రారంభించడానికి ఒక రోజు ముందే ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఏపీ సీఎం చంద్రబాబు నివాసంలో జరిగిన విందు భేటీలో పాల్గొన్నారు .. అయితే ఈ భేటీలో ఎక్కువగా రాజకీయ అంశాలపై చర్చ జరిగినట్లుగా తెలుస్తుంది .. ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య జగన్ రెడ్డి అని ఆయన్ను రాజకీయ భూస్థాపితం చేయకపోతే పెట్టుబడులు పెట్టేవారు కూడా ఆలోచన చేస్తారని కూటమి  నేతలు అమీత్ షాకు చెప్పినట్లుగా తెలుస్తుంది .. అంతేకాకుండా ఈ పదేళ్ల కాలంలో జగన్ రెడ్డి చేసిన మాఫియా తరహా పనుల‌ గురించి కూడా కీలకమైన అంశాలను అమిత్ షాకు లోకేష్ విఫలంగా వివరించినారని కూడా అంటున్నారు.


అలాగే పలు కంపెనీల యాజమాన్యాలను బెదిరించడం , ఆయా కంపెనీలను తమ స్వాధీనం చేసుకోవటం లిక్కర్లో చేసిన భారీ స్కాం మనీ లాండరింగ్ స‌హ‌ అనేక అంశాలను ఆయనతో ప్రస్తావించారు .. ఇలాంటివారు రాజకీయాలకు అనర్హులని అలాగే పక్క రాజకీయ వ్యూహాలతో కూటమి ఆయన్ను రాజకీయంగా పక్కకు తప్పించాల్సి ఉందన్న అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేశారు .. అలాగే ఇదే అంశంపై కూటమి  నేతలు అరగంటకు పైగా చర్చించి చివరికి ఓ భారీ వ్యూహాన్ని ఖరారు చేసుకున్నారని అంటున్నారు .. అలాగే దీనిపై త్వరలోనే కార్యాచరణ ప్రారంభించే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు.


ఆంధ్రప్రదేశ్ కి రావటానికి పెట్టుబడిదారులు వ్యక్తం చేస్తున్న అతిపెద్ద సందేహం మళ్లీ జగన్ వస్తే ఎలా అని .. తాము ఇక్కడ పెట్టుబడి పెట్టి కోల్పోలేమని .. తమకు పెద్ద గ్యారెంటీ ఇవ్వాలని వారు అంటున్నారు .. అందుకే ఇప్పుడు జగన్ ఇక రాబోరన్న గట్టి సంకేతాలను పారిశ్రామికవేత్తలు గుర్తించేలా చర్యలను త్వరలోనే తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి .. అవి కూడా ఇప్పటివరకు రాజకీయాల్లో ఎవరూ చూడని విధంగా ఊహించిన రేంజ్ లో ఉంటాయని అంటున్నారు .. అమిత్ షా ,  చంద్రబాబు విందు భేటీ రాజకీయంగా రాష్ట్రంలో కీలక మార్పులకు కారణమవుతుందని కూడా కూటమి వర్గాలు అంటున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: