ముఖ్యంగా ప్రభుత్వ శాఖలలో అవినీతి అధికారుల చేతివాటం చేస్తున్న వారికి ఏ ఒక్క శాఖ నుంచి మినహాయింపు లేదనే విషయాన్ని తెలియజేశారు. ఇదే విషయాన్ని గ్రహించిన పవన్ కళ్యాణ్ తన పరిధిలో ఉండే పంచాయతీరాజ్ ,గ్రామీణ అభివృద్ధి, అటవీ శాఖలో పెండింగ్ ఉన్న ఏసీబీ కేసుల పైన కూడా దృష్టి సాధించినట్లు సమాచారం. అసలు ఆ శాఖలలో ఇన్ని కేసులు ఎందుకు పెండింగ్ ఉన్నాయంటూ కూడా ఆ శాఖలకు సంబంధించి కార్యదర్శులను నిలదీసినట్లు తెలుస్తోంది. ఆ శాఖలకు సంబంధించి పెండింగ్ కారణాలు ఏంటో అన్ని విషయాలను కూడా తెలియజేయాలంటు ఉత్తర్వులు జారీ చేశారట.
ఇటీవలే పవన్ కళ్యాణ్ ఒక కీలకమైన అంశాన్ని కూడా ప్రస్తావించినట్లు తెలుస్తోంది.. ఏసీబీ విజిలెన్స్ కేసులలో విచారణలో భాగంగా నిందితుడు కానీ విచారణ అధికారి మధ్య సంబంధం లేకుండా ఎవరైనా వ్యవహరిస్తేనే.. కేసులకు పరిష్కారం ఉంటుందని అధికారులను ప్రశ్నించారు. విచారణ అధికారులతో ఏ రూపంలోనైనా సరే సంబంధాలు ఉన్నట్టు అయితే ఆ కేసులు పరిష్కారం అవ్వదని అది అట్టకెక్కుతాయని అంటూ తెలియజేశారట. అయితే ఇలాంటి విషయాలను ఏ ఒక్కరు కూడా పట్టించుకున్నట్టుగా కనిపించలేదు. పాలన పైన పవన్ కళ్యాణ్ కు ఇప్పుడు గట్టి పట్టు వచ్చిందని ఇదే స్పీడ్ కొనసాగితే ఆయా శాఖలలో అవినీతి పాల్పడిన అధికారులు అందరికీ కూడా భయం పుట్టడం ఖాయమని చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.