ఆదివారం, అంటే జనవరి 19న డీఎంకేలో చేరారు. చెన్నైలోని పార్టీ ప్రధాన కార్యాలయం అన్నా అరివాలయంలో ఆమె తీర్థం పుచ్చుకున్నారు. తమిళనాడు సీఎం ఎం.కె. స్టాలిన్ ఆమెను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఎంపీ టీఆర్ బాలు, మంత్రులు పీకే శేఖర్ బాబు, కేఎన్ నెహ్రూ తదితర డీఎంకే సీనియర్ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
పార్టీలో చేరిన తర్వాత దివ్య కృతజ్ఞతలు తెలిపారు. "నా జీవితంలో ఇది ఒక ముఖ్యమైన రోజు. ద్రవిడ మున్నేట్ర కజగంలో చేరడం నాకు గౌరవంగా ఉంది. మా సీఎం ఎం.కె. స్టాలిన్, డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌ల నమ్మకానికి, మద్దతుకు ధన్యవాదాలు," అని ఆమె సంతోషంగా చెప్పుకొచ్చారు.
తన భావాలను సోషల్ మీడియాలో పంచుకుంటూ, "డాక్టర్ కళైంజ్ఞర్ దివంగత ఎం. కరుణానిధి విజన్ కలిగిన మార్గం ద్వారా ప్రేరణ పొంది, ఒక గర్వించదగిన తమిళనాడు కుమార్తెగా ఈ ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నా. మా రాష్ట్ర ప్రజల పురోగతి కోసం నిస్వార్థంగా పనిచేయడమే నా లక్ష్యం," అని ఆమె రాసుకొచ్చారు.
తన తండ్రి తన విలువలను ఎలా ప్రభావితం చేశారో కూడా దివ్య వివరించారు. "నా తండ్రి, పురట్చి తమిజన్ సత్యరాజ్, నిజమైన సంపద సమానత్వం, సామాజిక న్యాయ సూత్రాలలో ఉందని నాకు నేర్పించారు. పెరియార్ స్ఫూర్తితో రూపొందిన ఈ విలువలు నా ప్రపంచ దృక్పథాన్ని తీర్చిదిద్దాయి, ఇప్పుడు ప్రజలకు సేవ చేయడానికి నన్ను ప్రేరేపిస్తున్నాయి," అని ఆమె తెలిపారు.
దివ్య రాజకీయ ప్రవేశంతో సంవత్సరాల తరబడి ఉన్న ఊహాగానాలకు తెరపడింది. ఆమె తొలిసారిగా 2019 ఎన్నికల సమయంలో ఎం.కె. స్టాలిన్‌ను కలిశారు, ఆ సమయంలో ఆమె రాజకీయ ఆకాంక్షలపై ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే, అప్పట్లో ఆమె కుటుంబం వాటిని మర్యాదపూర్వక సమావేశంగా కొట్టిపారేశారు. కానీ, ఇప్పుడు ఆమె అధికారికంగా పార్టీలో చేరడంతో ఆమె రాజకీయ ఆకాంక్షలు నిజమయ్యాయి.