ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా జనసేన అధినేత డిప్యూటీ ముఖ్యమంత్రి  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  వర్సెస్ మంత్రి నారా లోకేష్ మధ్య... ఏదో ఒక వివాదం నెలకొంటుంది. గత రెండు రోజుల నుంచి ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రిగా నారా లోకేష్  ను ప్రకటించాలని తెలుగు తమ్ముళ్లు డిమాండ్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ను సీఎం చేయాలని జనసేన నాయకులు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో.. తమ నాయకుడు లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలని తెలుగు తమ్ముళ్లు... బహిరంగంగానే ప్రకటిస్తున్నారు.


అన్ని అర్హతలు ఉన్న నారా లోకేష్ ను ప్రకటించాల్సిందేనని.... చంద్రబాబు నాయుడు ముందు డిమాండ్ వినిపిస్తున్నారు టిడిపి నేతలు. అయితే ఇలాంటి నేపథ్యంలో... నారా లోకేష్ అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మధ్య టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు చిచ్చుపెట్టినట్లు తెలుస్తోంది. మొన్న ఎనిమిదో తేదీన తొక్కిసలాట తిరుమలలో జరిగింది. ఈ సందర్భంగా తొకిస్తాలాట ఘటనపై టిటిడి చైర్మన్ బి ఆర్ నాయుడు క్షమాపణలు చెప్పాలని పవన్ కళ్యాణ్ మొన్న ప్రకటించిన సంగతి తెలిసిందే.

 

అయితే దీనిపై బిఆర్ నాయుడు చాలా సీరియస్ అయ్యారట. ఎవరెవరో తనకు సలహాలు ఇవ్వడం కాదని... చంద్రబాబు మాటే నాకు శాసనమని... బి ఆర్ నాయుడు మొన్న ప్రకటించారు. అయితే ఇదే అంశంపై తాజాగా మంత్రి నారా లోకేష్ స్పందించి... మరో పెద్ద పెంట పెట్టాడు. మొన్న సీనియర్ ఎన్టీఆర్ 29వ వర్ధంతి జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా హైదరాబాదులో ఉన్న ఎన్టీఆర్ గార్డు వద్ద నివాళులర్పించారు మంత్రి నారా లోకేష్.

 

అయితే నివాళులు అర్పించిన తర్వాత మీడియాను అడ్రస్ చేశారు నారా లోకేష్. ఈ సందర్భంగా BR నాయుడు పైన డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. అయితే దీనిపై నారా లోకేష్....   పవన్ కళ్యాణ్ కు జలక్ ఇచ్చేలా మాట్లాడారు. క్షమాపణలు చెప్పడం.. అనేది టిడిపి పార్టీ నిర్ణయం కాదని.. నారా లోకేష్ క్లారిటీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం క్షమాపణలు చెప్పాలని ఆయన పేర్కొన్నారని... వివరించారు. దీంతో నారా లోకేష్ పై జనసేన నాయకులు ఫైర్ అవుతున్నారు. పవన్ కళ్యాణ్ ని ఇంతమాట అంటావా అని ఆగ్రహిస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: