ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు రోజుల పాటు అమిత్ షా పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా బిజెపి నేతలు అలాగే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తో కీలక చర్చలు కూడా చేశారు అమిత్ షా. అలాగే పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా. ఈ సందర్భంగా ఏపీకి వరాల వర్షాన్ని కూడా కురిపించడం జరిగింది. అయితే... ఏపీ పర్యటనలో... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన ప్రత్యేక ఫోకస్ చేశారట కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.

 

ఈ సందర్భంగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి కి సంబంధించిన ఆస్తుల వివరాలను సేకరించారట. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ఎన్ని ప్యాలెస్లు ఉన్నాయని... కూటమి నేతలను అడిగి తెలుసుకున్నారట కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా. బెంగళూరు, హైదరాబాద్ తాడేపల్లిగూడెం, అలాగే ఇడుపులపాయలో మొత్తం నాలుగు ప్యాలస్సులు ఉన్నట్లు ఈ సందర్భంగా అమిత్ షాకు నారా లోకేష్ సమాధానం ఇచ్చారట.

 

ఒక్కో ప్యాలెస్ ఎంత విస్తీర్ణంలో ఉంటుందని కూడా ఈ సందర్భంగా అమిత్ షా ప్రశ్నించారట. దీనికి నారా లోకేశే సమాధానం ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. బెంగుళూరు ప్యాలెస్ 30ఎకరాల పైనే ఉందని, మిగిలినవి దాదాపు 6 ఎకరాల్లో ఉన్నాయని సమాధానం ఇచ్చారట ఏపీ మంత్రి నారా లోకేశ్.    ఇక విశాఖలో ప్రభుత్వ సొమ్ముతో రూ.500 కోట్లతో మరో ప్యాలెస్ నిర్మించుకున్నాడని చెప్పారట మంత్రి నారా లోకేశ్.


విశాఖ ప్యాలెస్‌కు ఎన్జీటీ రూ.200 కోట్ల ఫైన్ విధించిన విషయాన్ని అమిత్ షా కు వివరించారట నారా లోకేశ్.  ఎన్జీటీకి ఫైన్ కట్టారా..? ఎప్పటికైనా ఎన్జీటీకి ఫైన్ కట్టాల్సిందేగా అని స్పష్టం చేశారట అమిత్ షా. ఇక అటు గోదావరి-పెన్నా అనుసంధానంపై అమిత్ షా ఆరా తీయగా.. వివరాలు వెల్లడించారట సీఎం చంద్రబాబు నాయుడు. ఇక ఈ సంఘటనకు సంబంధించిన న్యూస్‌ వైరల్‌ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: