ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 - 8 నెలలు అవుతుంది. వాస్తవానికి ఎన్నికలకు ముందు ఎట్టి పరిస్థితులలోనూ జగన్మోహన్ రెడ్డిని గద్దె దించి వైసిపి ప్రభుత్వానికి చరమగీతం పడాలని తెలుగుదేశం పార్టీ శ్రేణులతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఎంతో కసి తో పనిచేశారు. అందుకే పవన్ కళ్యాణ్ స్వయంగా ఒక అడుగు ముందుకు వేసి ఓటు చీలనయ్యను అని శపధం చేసి మరి తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. ఈ క్రమంలో బిజెపిని కూడాకూటమి లోకి తీసుకురావటంలో కీలకపాత్ర పోషించారు. ఎలాగైనా జగన్ ను గద్దిదించాలని తాను ఒక అడుగు వెనక్కు వేయడంతో పాటు చాలా సీట్లు త్యాగం చేశారు. పార్టీ అధికారంలోకి వచ్చాక కూడా ఎక్కువ పదవులు ఆశించలేదు. ఇలాంటి టైం లో పవన్ కళ్యాణ్ ను చాలా గౌరవంగా హుందాగా చూసుకోవాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ శ్రేణుల మీద కూడా ఉంది.
అలాగే జన సైన సైనికుల మనోభావాలు దెబ్బ తినకుండా సమన్వంతో వెళ్లాల్సి న బాధ్యత టీడీపీ వాళ్ల మీదే ఎక్కువుగా ఉంది. అయితే గత ఐదారు రోజులుగా కాబోయే ఉప ముఖ్యమంత్రి నారా లోకేష్ అంటూ తెలుగుదేశం పార్టీ శ్రేణులు చేస్తున్న హడావుడి జనసేన సైనికులకు కూడా కోపం తెప్పిస్తోంది. ఈ క్రమంలోనే జనసేన సోషల్ మీడియా ఖాతాలలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు - ఉప ముఖ్యమంత్రి నారా లోకేష్ .. అలాగే హోం మంత్రిగా నారా భువనేశ్వరిని పెట్టండి అంటూ జన సైనికులు సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు. ఇక పర్యాటక - సినిమా శాఖ మంత్రిగా నందమూరి బాలకృష్ణను ఎంపిక చేయాలని .. ఇంకా ఎవరెవరు ఉన్నారు మీ ఫ్యామిలీ లో అందర్నీ ఏరుకుని మరి పదవులు ఇచ్చుకోండి మొత్తం ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకోండి అంటూ విమర్శలు చేస్తున్నారు. ఏదేమైనా దీనిపై చంద్రబాబు జోక్యం చేసుకోక పోతే .. లేదా పార్టీ సోషల్ మీడియాను కట్టడి చేయకపోతే కూటమిలో లుకలుకలు వచ్చే ప్రమాదం ఉంది.