నేడు అంటే జనవరి 20న డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఆయన గురించి అనేక వార్తలు వస్తున్నాయి. అంతేకాదు  అమెరికా అధ్యక్షుడికి ఎంత జీతం ఉంటుంది, ఎలాంటి అలవెన్సులు, బెనిఫిట్స్ అందుతాయి? వంటి వివరాలను తెలుసుకోవడానికి చాలామంది ప్రయత్నిస్తున్నారు. ఇతర దేశాల శాలరీలు కూడా తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మరి అమెరికా అధ్యక్షుడికి లభించే ఆర్థిక ప్రయోజనాలు, సౌకర్యాల గురించిన పూర్తి వివరాలు మనం కూడా తెలుసుకుందాం పదండి.

యూఎస్ ప్రెసిడెంట్ ఏడాదికి 4 లక్షల డాలర్ల (సుమారు రూ.3.46 కోట్లు) జీతం అందుతుంది. విశేషం ఏంటంటే, ఈ మొత్తం 2001 సంవత్సరం నుంచి మారలేదు. అంటే, నెలకు దాదాపు రూ.30 లక్షల జీతం అన్నమాట. అంతే కాదు, ఈ అగ్రరాజ్య అధ్యక్షుడికి ఏడాదికి ఎక్స్‌ట్రాగా 1 లక్షా 69 వేల డాలర్ల (దాదాపు రూ.1.46 కోట్లు) అలవెన్సులు కూడా లభిస్తాయి. అందులో ముఖ్యమైనవి వ్యక్తిగత ఖర్చుల కోసం 50 వేల డాలర్లు, ఎంటర్‌టైన్‌మెంట్ కోసం 19 వేల డాలర్లు, ట్యాక్స్ ఫ్రీ ప్రయాణాల కోసం 1 లక్ష డాలర్లు.

మొత్తంగా చూసుకుంటే అమెరికా అధ్యక్షుడికి ఏడాదికి దాదాపు రూ.5 కోట్ల వరకు అందుతాయి. అయితే అమెరికా అధ్యక్షుడి జీతం భారీగానే ఉన్నా, కొన్ని దేశాల అధినేతలు వీరి కంటే ఎక్కువ సంపాదిస్తున్నారు. ఉదాహరణకు సింగపూర్ ప్రధానమంత్రి ఏడాదికి రూ.13.85 కోట్లు సంపాదిస్తున్నారు.

హాంకాంగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఏటా రూ.6 కోట్ల పైగా అందుకుంటున్నారు. స్విట్జర్లాండ్ అధ్యక్షుడు సంవత్సరానికి రూ.4.93 కోట్లు సంపాదిస్తున్నారు. దాదాపు అమెరికా అధ్యక్షుడితో సమానం. ఆస్ట్రేలియా అధ్యక్షుడు ఏడాదికి రూ.3.57 కోట్లు సంపాదిస్తున్నారు.

మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, అమెరికా తలసరి జీడీపీలో అధ్యక్షుడి జీతం 606% ఉండగా, కెన్యా అధ్యక్షుడి జీతం ఆ దేశ తలసరి జీడీపీలో ఏకంగా 2,360% ఉంది. దీన్ని బట్టి ఒక్కొక్క దేశ ఆర్థిక పరిస్థితులు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు.

ఇక అమెరికా అధ్యక్షుడికి ఉండే సౌకర్యాల గురించి చెప్పేదేముంది, అధ్యక్షుడు నివసించే వైట్ హౌస్‌లో అన్ని అత్యాధునిక సదుపాయాలు ఉంటాయి. అంతేకాదు, మెరైన్ కమాండోలు, సీక్రెట్ సర్వీస్ అధికారులు నిరంతరం భద్రత కల్పిస్తూ ఉంటారు. క్షణం తీరిక లేకుండా దేశం కోసం పనిచేసే అధ్యక్షుడికి ఇవన్నీ అవసరమేనని చెప్పుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: