8-3-2019 లో టిడిపి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జీవో నెంబర్ 45 తో 14 నెంబర్ చట్టం ప్రకారం EWS కోటాలో కాపులకు సైతం 5 శాతం రిజర్వేషన్ ని కల్పిస్తూ ఉత్తర్వులను జారీ చేశారు. అయితే ఆ తర్వాత అధికారం చేపట్టిన వైసిపి పార్టీ కాపులకు ఎలాంటి రిజర్వేషన్ ఇవ్వలేదంటూ తెలియజేస్తూ ఒక లెటర్ ని తాజాగా హరిరామ జోగయ్య డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు , సీఎం చంద్రబాబు కి రాసినట్లు ఒక లేఖ వైరల్ గా మారుతోంది. తాము పిటిషన్ వేసినా కూడా గత ప్రభుత్వ కౌంటర్ ఇస్తూ ఐదు శాతం రిజర్వేషన్ అమలు చేయకూడదని అభ్యంతరాలను తెలిపింది అంటూ తెలిపారట.
డిసెంబర్ గత ఏడాది 4వ తేదీన న్యాయస్థానంలో విచారణ జరపగా తదుపరి విచారణ ఈనెల 28వ తేదీకి న్యాయస్థానం పొడిగించింది అంటూ తెలిపారు.ఈలోపు కూటమి ప్రభుత్వం కాపుల పట్ల ఎలాంటి పట్టు ఉందో తెలిపాలని తెలిపారు. గతంలో చంద్రబాబు నాయుడు కాపులకు ఇచ్చినటువంటి 5% శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి అంటు తెలుపుతున్నారు.. అలాగే తాను ఆమరణ నిరాహార దీక్ష చేసినప్పుడు రిజర్వేషన్ అంశంలో కలిసి పనిచేద్దామంటూ తన దీక్షను విరమిచ్చి తనకు మాట ఇచ్చిన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం మాట నిలబెట్టుకోవాలి అంటూ హరి రామజోగయ్య తాజాగా లేఖ రాశారు. మరి ఈ విషయంపై చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారో చూడాలి.