అసలు విషయంలోకి వెళ్తే మొదట మహాసేన రాజేష్ ఈ డిమాండ్ ని పైకి లేవనెత్తడంతో ఆ తర్వాత కొంతమంది సీనియర్ నేతలు మరి కొంతమంది లోకేష్ దగ్గర మెప్పు పొందడానికి లోకేష్ ని సైతం డిప్యూటీ సీఎం గా అనౌన్స్మెంట్ చేయాలని చంద్రబాబు దగ్గర వెళ్లి మాట్లాడిన వారు కూడా ఉన్నారట. ఇలా కొంతమంది నేతలు మీడియా ముఖంగానే లోకేష్ డిప్యూటీ సీఎం అవ్వడానికి అర్హత ఉందని టిడిపి పార్టీ గెలవడానికి కూడా లోకేష్ చాలా కష్టపడ్డారని.. రాబోయే రోజుల్లో టిడిపి పార్టీ పగ్గాలు చేపట్టాలి అంటే కొంతమేరకు ఎక్స్పీరియన్స్ ఉండాలని చాలామంది మాట్లాడడం జరిగింది.
ముఖ్యంగా హై కమాండ్ డిమాండ్ల వల్లే వీరు ఇలా ప్రవర్తించాలనే విధంగా వార్తలు వినిపించాయి. ముఖ్యంగా కూటమిగా ఏర్పడిన ఒక ప్రభుత్వంలో ఒక సీఎం ఒక డిప్యూటీ సీఎం మాత్రమే ఉంటారని ఈ విషయాన్ని కట్టుబడి ఉన్నారట. ఇప్పుడు మరొక డిప్యూటీ సీఎం అంటే కచ్చితంగా కూటమిలో చర్చలు జరపాలని హెచ్చరించారట. అయితే ఈ విషయం పైన హై కమాండ్ కూడా నేతలందరిని హెచ్చరిస్తూ ఈ విషయం మీద ఎవరూ కూడా మాట్లాడకూడదని.. హెచ్చరించారట. ముఖ్యంగా డిప్యూటీ సీఎం హోదా లోకేష్ కి ఇస్తే తమ నేత ప్రాధాన్యత తగ్గుతుందని జనసేన నేతలు కార్యకర్తలు కూడా భావిస్తూ ఉండడంతో హై కమాండ్ ఇక మీదట ఈ విషయం గురించి మాట్లాడకూడదని హెచ్చరించారట.