అయితే ఎందుకని ఈ పదవులు పొందినటువంటి వారు కింద స్థాయి వారు.. వీళ్ళందరికీ ఇస్తున్నారనే రెడ్ల దూరమయ్యారట. ఇప్పుడు రెడ్ల ని పక్కన పెట్టుకునే ఉన్నారు. అందరూ చుట్టు కనబడుతున్న వాళ్ళందరూ.. ఒక్క సామాజిక వర్గం ప్రధానంగా కనిపిస్తోంది. వై వి సుబ్బారెడ్డి, సజ్జన రామకృష్ణారెడ్డి, కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సామాజికం వర్గం వారే.. అయితే ఇక్కడ కావాల్సినది మిగతా సామాజిక వర్గం వారు కూడా. అంబటి రాంబాబు ప్రెస్ మీట్లు, పేర్ని నాని కేసులలో కాస్త సైడ్ ట్రాక్ అయ్యారు. మళ్లీ వీరందరూ కూడా తెరమీద కనిపిస్తున్నారు.
ముఖ్యంగా జగన్ చుట్టూ తిరిగేటువంటి వాళ్ళల్లో అన్ని కమ్యూనిటీస్ ఉండేవారు చూసుకోవాలి. డామినేటింగ్ రోల్ కనిపించాలి పార్టీలో.. వీరు క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు అనేటట్టుగా అనిపించాలట. బొత్స సత్యనారాయణ కనిపిస్తున్నారు కానీ ఆయన విశాఖ వరకే పరిమితమవుతున్నారు. అన్ని వర్గాలలో బలమైనటువంటి నాయకులు ఉన్నారు. వీరందరినీ కూడా ఉపయోగించుకోవలసి ఉంటుంది.. మొత్తానికి రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అడుగులు వేసి తన పార్టీని ముందుకు నడిపిస్తారో చూడాలి.