జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు. భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ సీఎం కావాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. పవన్ టీడీపీకి మద్దతు ఇచ్చిన ప్రతి సందర్భంలో ఆ పార్టీకి విజయం దక్కిందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
 
అయితే టీడీపీ అధిష్టానం నారా లోకేశ్ ను సీఎం చేయాలని తాజాగా ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే టీడీపీ ఆలస్యంగా స్పందించడం ఒక విధంగా నష్టం చేసిందని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. లోకేశ్ డిప్యూటీ సీఎం అయితే పవన్ సీఎం అవుతారంటూ కొత్త వాదన సైతం తెరపైకి వచ్చింది. అయితే వైరల్ వార్తల వల్ల టీడీపీకి తీవ్రస్థాయిలో నష్టం కలిగిందని చెప్పవచ్చు.
 
పలువురు టీడీపీ నేతలు లోకేశ్ ను డిప్యూటీ సీఎం చేయాలనే డిమాండ్ ను తెరపైకి తీసుకొని రావడం వల్ల పార్టీకి తీవ్రస్థాయిలో నష్టం కలుగుతోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. లోకేశ్ ను డిప్యూటీ సీఎం చేస్తే గతంలో చంద్రబాబు ఇచ్చిన మాట తప్పినట్టు అవుతుంది. గతంలో చంద్రబాబు మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పదవిలో పవన్ మాత్రమే ఉంటారని చెప్పారు.
 
చంద్రబాబు, పవన్ మధ్య గ్యాప్ పెరిగితే వైసీపీకి ఊహించని స్థాయిలో బెనిఫిట్ కలుగుతుంది. నేతల వ్యక్తిగత అభిప్రాయాలు పార్టీకి తీవ్ర స్థాయిలో నష్టం చేస్తున్నాయి. పవన్ కళ్యాణ్ దూకుడు పెంచడం వల్లే రాజకీయాల్లో భిన్నాభిప్రాయాలు మొదలవుతున్నాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ వివాదాలకు ఆదిలోనే చెక్ పడితే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పవర్ స్టార్, పవన్ కళ్యాణ్ తను నమ్మిన సిద్ధాంతాలకు పూర్తిస్థాయిలో కట్టుబడి ఉంటారనే సంగతి తెలిసిందే. అన్యాయం జరిగితే పవర్ స్్తార్ పవన్ కళ్యాణ్ అస్సలు తట్టుకోలేరు.




మరింత సమాచారం తెలుసుకోండి: