తిరుమల తిరుపతి దేవస్థానం ఈ మధ్య కాలంలో అపచారాలు ఎక్కువగా జరుగుతున్న సంగతి తెలిసిందే. తిరుమల తిరుపతి దేవస్థానంలో తొక్కిసలాట, మందు బాటిళ్లు, బిర్యానీ ప్యాకెట్లు ఇలా చాలా దర్శనం ఇస్తున్నాయి. అయితే.. దీనిపై తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి అలర్ట్‌ అయింది. నిందితులపై చర్యలు కూడా తీసుకుంటోంది. అయితే.. ఇది ఇలా ఉండగా... తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి.

తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్నదానం పెడతారన్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ అన్నధానం విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది తిరుమల తిరుపతి దేవస్థానం  పాలక మండలి. భక్తులకు రుచికరమైన ఆహారాన్ని అందించేలా టీటీడీ నిర్ణయం తీసుకోవడం జరిగింది.  అన్నప్రసాదం మెనూలో మార్పులు చేస్తున్న టీటీడీ అధికారులు.. ఈ మేరకు ఆ దిశగా అడుగులు  వేస్తున్నారు.   భోజనంతో పాటు మసాలా వడలు పెట్టాలని ప్రయోగాత్మకంగా పరిశీలన చేస్తున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం  పాలక మండలి అధికారులు.

ఉల్లిపాయలు, వెల్లులి లేకుండా మసాలా వడలను తయారు చేసిన టీటీడీ పాలక మండలి..  ట్రయల్ రన్‌లో భాగంగా తాజాగా కొంత మంది భక్తులకు అందజేయడం జరిగింది.  ట్రయల్ రన్‌లో భాగంగా దాదాపు 5 వేల మంది భక్తులకు మసాలా వడలు వడ్డించింది టీటీడీ పాలక మండలి. ఇక అటు ఫిబ్ర‌వ‌రి 4వ తేదీ రథసప్తమి సందర్భంగా పూర్తిస్థాయిలో భక్తులందరికీ వడ్డించేలా టీటీడీ చర్యలు తీసుకుంటోంది.



ఆ దిశగా అడుగులు వేస్తోంది టీటీడీ పాలక మండలి.  అయితే... ఉల్లిపాయలు, వెల్లులి లేకుండా మసాలా వడలను వడ్డించేందుకు టీటీడీ పాలక మండలి..తీసుకున్న నిర్నయంపై భక్తుల నుంచి కూడా విశేష స్పందన వస్తోంది. ఇలాంటి కార్యక్రమాలు మరన్ని చేయాలని కోరుతున్నారు తిరుమల శ్రీవారి భక్తులు. ఇది ఇలా ఉండగా.. గడిచిన 24 గంటల్లో.. 70 వేలకు పైగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు భక్తులు. అలాగే.. దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: