సోమవారం గూడూరు మండలంలో పలు గ్రామాల్లో పర్యటించిన ఎమ్మెల్యే కాగిత కాన్వాయ్‌ను తొలత సంతోష్ అడ్డగించారు .. ఆ క్రమంలోనే తన బాధను వినాలంటూ ఎమ్మెల్యే కారును ఆపాడు.. అయితే ఎమ్మెల్యే పెద్దగా తనను పట్టించుకోకపోవడంతో వెంటనే తన వద్ద ఉన్న పురుగుల మందు బయటకు తీసి తాగేశాడు .. ఈ ఊహించని పరిణామానికి ఒకసారిగా షాక్ అయిన ఎమ్మెల్యే ఒక్కసారిగా కారు దిగి జనసేన కార్యకర్తకు నచ్చ చెప్పే ప్రయత్నం చేశాడు. గూడూరు మండలం జనసేన ప్రధాన ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్న సంతోష్ పట్ల గూడూరు టిడిపి మండల పార్టీ అధ్యక్షుడు పోతన స్వామి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని జనసేన నేతలు కూడా ఆరోపించారు ..
ఎమ్మెల్యే సూచనలతో సంతోష్ ను మచిలీపట్నం ఆస్పత్రికి తీసుకువెళ్లగా. జనసేన నేతలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు .. అలాగే టిడిపి నేత స్వామి తీరుపై కూడా తీవ్ర విమర్శలు వచ్చాయి .. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి తాము కూడా కష్టపడి పని చేశామని అయితే కష్టాన్ని గుర్తించకపోగా తమపై దుర్భాషలాడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక జనసేన కార్యకర్త సంతోష్ ఆత్మహత్యాయత్నం కృష్ణాజిల్లాలో ఒక్కసారిగా కలకాలం రేపింది .. ఈ ఊహించని సంఘటనతో కూటమి క్యాడర్లో గ్రౌండ్ స్థాయి నేతల మధ్య సరైన సఖ్యత లేదన్న విషయం మరోసారి బయటకు వచ్చింది .. మూడు పార్టీలకు సంబంధించిన కార్యకర్తల మధ్య సమన్వయం కోసం ప్రత్యేకంగా కమిటీలు వేసినప్పటికీ అవి ఆశలు పనిచేస్తున్నట్లు ఎక్కడ కనిపించడం లేదు .. ప్రధానంగా టిడిపి నాయకులు తమను నిర్లక్ష్యం చేస్తున్నారనే భావన జనసేన కార్యకర్తల్లో మరింత పెరిగిపోతుందని అంటున్నారు .. అందుకే ఇలాంటి సంఘటనలు వరుసగా చోటు చేసుకుంటున్నయని కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.