రెడ్ బుక్ ఏపీ రాజకీయాల్లో సరికొత్త పద ప్రయోగం చేసిన ఘనత అచ్చంగా నారా లోకేష్ దే. ఆయన యువగళం పేరుతో సాగించిన పాదయాత్రలో ప్రతీ చోటా రెడ్ బుక్ గురించి ప్రస్తావించారు.  టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది.  రెడ్ బుక్ రాజ్యాంగం అంటోంది వైసీపీ.  ఇది పక్కాగా అమలు కావాలని టీడీపీ అభిమానులు క్యాడర్ కోరుకుంటున్నారు.  రెడ్ బుక్ ఆవిష్కర్త  నారా లోకేష్ దీని మీద ఏమి చెబుతున్నారు అన్నదే ఇంట్రెస్టింగ్ పాయింట్.


జ్యూరిచ్‌లో జరిగిన తెలుగు ప్రవాసులతో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో లోకేష్ మాట్లాడుతూ, ఒక తమ్ముడు రెడ్ బుక్ గురించి తన వద్ద ప్రస్తావించారని అన్నారు. ఇది ఇంతలా పాపులర్ కావడం పట్ల ఆయన ఒకింత ఆశ్చర్యంతో కూడిన ఆనందం వ్యక్తం చేశారు తాను పాదయాత్రలో రెడ్ బుక్ గురించి మాట్లాడినపుడు కూడా ఇంతలా చర్చకు రాలేదని అన్నారు


అధికారంలోకి వచ్చాం కదా అని కక్ష తీర్చుకునే ప్రభుత్వం మాది కాదని ఆయన స్పష్టం చేశారు. రెడ్ బుక్ స్టార్ట్ అయింది అని ఆయన అక్కడ సభికులతో మాట్లాడుతూ సంచలన కామెంట్స్ చేశారు.  ఏ విషయం అయినా ఎస్టాబ్లిష్ చేయాలి  కదా అని కూడా అన్నారు. దీనిని అండర్ లైన్ చేసుకోవాలని సూచించారు.  రెడ్ బుక్ విషయంలో ఎలాంటి డౌట్లూ ఉండనక్కరలేదని స్పష్టం చేశారు. తాను పాదయాత్రలో చెప్పిందేటి అన్నది కూడా వివరించారు. ఎవరైతే చట్టాన్ని ఉల్లఘించి ప్రజలను కార్యకర్తలను బాధపెట్టారో వాళ్ళను వదిలేది లేదు అని క్లారిటీగా చెప్పామని అన్నారు


అందువల్ల ఎలాంటి సందేహమూ అవసరం లేదు, మీరు రిలాక్స్ గా ఉండండి అన్నీ చూస్తారు అని లోకేష్ చెప్పారు. రెడ్ బుక్ పని ఆల్రెడీ మొదలైంది. దానిని పూర్తి చేసే బాధ్యత కూడా మేమే తీసుకుంటామని లోకేష్ కీలక కామెంట్స్ చేశారు. చంద్రబాబు గురించి కూడా ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. ఆయనతో పనిచేయడం అంటే కష్టమే అంటూ మాట్లాడారు.  ఏపీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని కూడా లోకేష్ ఆయన వివరించారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: