అలాంటి భక్తజన సందోహంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు చెందిన ఒక వీరాభిమాని అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ భక్తుడు ఆర్సీబీ జెర్సీని గంగా నది పవిత్ర జలాల్లో ముంచుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. తన అభిమాన క్రికెట్ జట్టు విజయం సాధించాలని కోరుకుంటూ, అతడు పదే పదే అలా జెర్సీని నీటిలో ముంచుతూ కనిపించాడు.
అతడు ఇలా చేయడాన్ని చూసి చాలామంది నోరెళ్లబెట్టారు. వైరల్ వీడియో చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ఆర్సీబీ జట్టు పట్ల ఆ అభిమానికున్న మక్కువ, అంకితభావానికి నెటిజన్లు వావ్ అంటున్నారు. సోషల్ మీడియా యూజర్లు వీడియోను షేర్ చేస్తూ, కామెంట్లు పెడుతున్నారు. కొందరు దీన్ని ఫన్నీగా భావిస్తుంటే, మరికొందరు నిజమైన అభిమానానికి నిదర్శనంగా అభివర్ణిస్తున్నారు. మతపరమైన కార్యక్రమంలో కూడా తమ అభిమాన క్రీడా జట్లతో ప్రజలు ఎంతగా కనెక్ట్ అవుతారనే అంశంపై ఈ వీడియో చర్చకు దారితీసింది.
మహా కుంభమేళా కేవలం మతపరమైన కార్యక్రమం మాత్రమే కాదు. ఇది గొప్ప సాంస్కృతిక, ఆధ్యాత్మిక పండుగ, ఇక్కడ ప్రజలు విశ్వాసం, భక్తిని చాటుకుంటారు. ఈ సంవత్సరం ఈ వేడుక జీవితంలో ఒక్కసారి మాత్రమే వచ్చే విశిష్టతను సంతరించుకోవడంతో మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. సాంప్రదాయ ఆచారాలు, ప్రార్థనలతో పాటు, ఆర్సీబీ అభిమాని చేసిన ఈ పని పండుగ వాతావరణాన్ని కాస్త ఫన్నీగా మార్చేసింది.