ముఖ్యంగా జగన్ అక్రమ ఆస్తుల కేసులో జరుగుతున్న విచారణ పైన అభ్యంతరాన్ని తెలియజేస్తూ rrr ఒక పిటిషన్ దాఖలు చేశారట. జగన్ పై సిబిఐ అక్రమాస్తుల కేసును నమోదు చేసి ఇప్పటికి దశాబ్దంపైగా అయినా కూడా ఈ కేసులు పూర్తిస్థాయిలో చార్జిషీట్ దాఖలు చేయలేదు అంటూ అందుకు తగ్గట్టుగా విచారణ పూర్తి కాలేదని అంతేకాకుండా ఆలోపే పదుల సంఖ్యలో వచ్చి పడుతున్న డిశ్చార్జ్ పిటిషన్లు కూడా తేల్చలేక సిబిఐ కోర్టుతో పాటు, తెలంగాణ హైకోర్టు కూడా చేతులెత్తేసిన పరిస్థితి ఏర్పడిందట. డిశ్చార్జ్ పిటిషన్ ల పైన తీర్పులు ఇచ్చేందుకు ఐదుగురు సిబిఐ కోర్టు న్యాయమూర్తులు సైతం బదిలీ అయ్యి వెళ్లిపోయారంటూ తాజాగా rrr లాయర్ల సైతం సుప్రీంకోర్టు దృష్టికి తీసుకు వెళ్లడం జరిగిందట.
అయితే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు హైకోర్టు పర్యవేక్షణలో ఈ కేసు విచారణ జరిగేలా కనిపించడం లేదంటూ వెల్లడించారట. ఇదంతా చూస్తూ ఉంటే జగన్ కి సపోర్టివ్ గా సిబిఐ కుమ్మకు అయినట్టు కనిపిస్తోందంటూ..జగన్ అక్రమాస్తుల కేసు తెలంగాణ నుంచి మరొక రాష్ట్రానికి బదిలీ చేయాలి అంటూ rrr లాయర్లు కోరగా.. దీనిమీద సుప్రీంకోర్టు విచారణ జరిపిస్తూ ధర్మాసనం ఈ విషయాన్ని అంగీకరించలేదట. ఈ కేసు విచారణ ఇక్కడే జరుగుతుందని సూచించారట. దీంతో రఘురామ లాయర్లు వెనక్కి తగ్గారు. మొత్తానికి వచ్చే సోమవారానికి ఇది కేసుని వాయిదా వేశారు.