అగ్రరాజ్యం అమెరికా 47వ అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేశారు. వాషింగ్టన్ లోని క్యాపిటల్ హాల్ రోటుండాలో 25 వేల మంది అతిధుల సమక్షంలో జరిగిన కార్యక్రమంలో భాగంగా ప్రెసిడెంట్ గా డోనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేశారు. వైస్ ప్రెసిడెంట్ గా జెడి వాన్స్ ప్రమాణ స్వీకారం చేశారు. అమెరికా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జాన్ రాబర్ట్స్ వీరి చేత ప్రమాణ స్వీకారాన్ని చేయించారు.


18861లో అబ్రహం లింకన్ ప్రమాణ స్వీకారంతో ఉపయోగించిన బైబిల్ తో పాటు తన బైబిల్ ను కూడా చేతిలో పట్టుకుని డోనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించడం జరిగింది. వరుసగా కాకుండా రెండోసారి అమెరికాకు అధ్యక్షుడు అయిన రెండో వ్యక్తిగా డోనాల్డ్ ట్రంప్ చరిత్రను సృష్టించారు. గత సంవత్సరం నవంబర్ లో జరిగిన ఎన్నికల్లో ట్రంప్ రెండవసారి విజయాన్ని సాధించారు. డోనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారానికి భారతదేశం తరుపున విదేశాంగ శాఖమంత్రి ఎస్. జై శంకర్ హాజరు కావడం విశేషం.


డోనాల్డ్ ట్రంప్ కు ప్రధాని మోడీ రాసిన లేఖను ఇండియా ప్రతినిధిగా హాజరైన జై శంకర్ అందించారు. అయితే వచ్చిన వెంటనే ట్రంప్ వివాదాస్పద నిర్ణయాలను తీసుకోవడం జరిగింది. వ‌చ్చిరాగానే ట్రంప్ వివాదాస్ప‌ద నిర్ణ‌యాలు తీసుకున్నారు.  బ‌ర్త్ రైట్ సిటిజ‌న్‌షిప్ ర‌ద్దు చేసింది డొనాల్డ్‌ ట్రంప్‌ సర్కార్‌.  అమెరికా గ‌డ్డ‌పై పుడితే స‌హ‌జంగానే పౌర‌స‌త్వం ఇచ్చేందుకు సిద్ధం అయింది డొనాల్డ్‌ ట్రంప్‌ సర్కార్‌.


150 ఏళ్లుగా అమ‌ల్లో విధానం ర‌ద్దు చేశారు ట్రంప్‌. అమెరికా సహా 30 దేశాల్లో జన్మతః పౌరసత్వ చట్టం అమలు కాబోతుంది.  ఇకపై ఇలాంటి వెసులుబాటు లేకుండా చేసింది డొనాల్డ్‌ ట్రంప్‌ సర్కార్‌. జన్మతః పౌరసత్వాన్ని అందించే చట్టం రద్దు చేస్తూ ఆదేశాలు ఇచ్చింది డొనాల్డ్‌ ట్రంప్‌ సర్కార్‌. ట్రంప్ నిర్ణ‌యంతో ఎన్నారైల్లో అల‌జ‌డి నెలకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: