ఆంధ్రప్రదేశ్లో సీఎం చంద్రబాబు నాయుడు తర్వాత టిడిపి పార్టీని ఆయన కుమారుడు ప్రస్తుతం మంత్రి నారా లోకేష్ బాధ్యతలు చేపట్టడానికి కొంతమంది నేతలు ఇటీవలే లోకేష్ ని డిప్యూటీ సీఎం చేయాలి అంటు తెరమీదికి తీసుకురావడం జరిగింది. మొదట ఒకరిద్దరి నేతలతో ఈ విషయం వైరల్ గా మారిన ఆ తర్వాత చాలామంది నేతలు డిమాండ్ చేస్తూ మీడియా ముందు మాట్లాడారు. సడన్గా ఈ విషయం పైన టిడిపి అధిష్టానం నిన్నటి రోజున స్పందించి ఈ విషయాలకు పుల్ స్టాప్ పెట్టేలా చేసింది. అంతేకాకుండా మరికొంత మంత్రులు లోకేష్ ను సీఎం చేయాలి అంటూ వ్యాఖ్యలు చేయడంతో ఈ విషయం పైన చంద్రబాబు కూడా ఫైర్ అయ్యారట. కానీ లోకేష్ విషయంలో టిడిపి ఎందుకు వెనక్కు తగ్గిందనే విషయంపై ఇప్పుడు ఆసక్తికరమైన విషయాలు వైరల్ గా మారుతున్నాయి.


రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ ఏర్పడింది టిడిపి ,బిజెపి, జనసేన పార్టీల వాళ్లే అని చెప్పవచ్చు.. గతంలో ఈ కూటమి ఒప్పందం కూడా చంద్రబాబు సీఎం కావాలని పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కావాలని.. నేతలకు ఇతర పదవులు పంపకాలు చేయాలని విషయం పైన మాత్రమే ఒప్పందం కుదుర్చుకున్నారట. కానీ ఆరు నెలలకే కొంతమంది లోకేష్ వర్గం వారు లోకేష్ ని డిస్ట్రిబ్యూటీ సీఎం చేయాలి అంటూ ప్రచారం మొదలుపెట్టారు.


నిజానికి టిడిపి పార్టీలో ఒక ఆనవాయితీ ఉన్నదట. అదేమిటంటే తమకు అనుకూల మీడియా ద్వారా ఏదైనా ముందుగానే సంకేతాలు జనంలోకి పంపించేలా లీకులు ఇస్తూ ఉంటారట.. వీటిపైన సానుకూలంగా స్పందన వస్తేనే నిర్ణయాన్ని తీసుకోవడానికి ముందుకు వెళ్తారట. లేకపోతే వెనకడుగు వేస్తారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు లోకేష్ విషయంలో కూడా ఇలాగే జరిగినట్లు చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా లోకేష్ ను డిప్యూటీ సీఎం చేస్తే కచ్చితంగా నష్టమే ఆయనకు ఎక్కువగా జరుగుతుందని విషయాన్ని టిడిపి పార్టీ గ్రహించిందట. గతంలో ఐదు మంది డిప్యూటీ సీఎంలు ఉన్న ఎలాంటి అధికారం లేకపోవడంతో పాటుగా నామవాస్త్రానికి కొనసాగించారు ..



అంతేకాకుండా వీటికి తోడు జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ ని సీఎం చేయాలనే కొత్త డిమాండ్ ని తెరమీదకి కోరుకుంటూ కొన్ని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఒక్కసారిగా టిడిపి యూటర్న్ తీసుకుందనే వార్తలు వినిపిస్తున్నాయి. కానీ వీటి వెనుక కూడా ఒక మాస్టర్ ప్లాన్ ఉందనే విధంగా టాక్ అయితే వినిపిస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: