మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లెని కుటుంబం నుంచి హీరోగా సినిమాల్లోకి వచ్చి వందలాది సినిమాలలో నటించి తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. చిరంజీవికి కోట్లాది సంఖ్యలో అభిమానులు ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా చిరంజీవిని ఎంతగానో అభిమానులు ఆదరిస్తారు. ఇండస్ట్రీలో ప్రస్తుతం చిరంజీవి గాడ్ ఫాదర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.


కొత్తగా సినిమాలలోకి వచ్చే వారికి చిరంజీవి ఎంతగానో అండగా ఉంటాడు. దాదాపు నాలుగు దశాబ్దాల నుంచి సినీ ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. కొద్దిరోజుల క్రితం బోలాశంకర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిరంజీవి అభిమానులను ఆకట్టుకోలేకపోయాడు. ఇప్పుడు డిఫరెంట్ కాన్సెప్ట్ తో విశ్వంభర సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నారు.



ఇదిలా ఉండగా.... చిరంజీవి మళ్ళీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. చిరంజీవి ముందు రెండు ఆప్షన్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. అందులో తన తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఉంది. కానీ చిరు మాత్రం అది కాకుండా భారతీయ జనతా పార్టీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయట. కాగా, రీసెంట్ గానే చిరంజీవికి భారతీయ జనతా పార్టీ నుంచి ఓ కీలక పదవి కూడా ఇస్తామని ఆఫర్ వచ్చిందట.


ఇలా మొత్తానికి చిరంజీవి పొలిటికల్ రీ ఎంట్రీకి సంబంధించి వార్తలు వైరల్ అవుతున్నాయి. బిజెపిలోకి చిరంజీవి వెళ్లినట్లయితే ఢిల్లీ స్టార్ కాంపెయినర్ గా మెగాస్టార్ చిరంజీవి ఉండబోతున్నారట. ఢిల్లీ ఎన్నికల్లో బిజెపి తరఫున మెగా బ్రదర్స్ ప్రచారం చేయనున్నారట. ఇక ఢిల్లీ ఎన్నికల తర్వాత చిరంజీవికి రాజ్యసభ, ఆపై కేంద్రమంత్రి పదవి ఇచ్చే అవకాశాలు ఉన్నాయని జోరుగా ప్రచారాలు సాగుతున్నాయి. మరి చిరంజీవి నిజంగానే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది. ఈ వార్తలపై చిరంజీవి ఎలా స్పందిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: