దొంగచాటుగా మంత్రి అయ్యావు.. దైర్యంగా ఎన్నికయ్యే దమ్ము లేదంటూ లోకేష్ ఎంతగానో అవమానించారు.. దానికి తోడు 2019 ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది..ఏకంగా 151 సీట్లతో వైసీపీ భారీ విజయం సాధించింది.. వైసీపీ భారీగా సీట్లు గెలవడంతో అప్పటి నుంచి టీడీపీపై విమర్శనాస్త్రాలతో విరుచుకుపడ్డారు.. ఒకానొక సమయంలో అసెంబ్లీ సాక్షిగా లోకేష్ తల్లిని అవమానించారు.. తన భార్యకు జరిగిన అవమానాన్ని తలుచుకుని చంద్రబాబు బోరున ఏడ్చారు.. తన తల్లికి జరిగిన అవమానాన్ని బదులు ఇవ్వాలని నిర్ణయించుకున్న లోకేష్ తనని బలమైన నాయకుడిగా నిరూపించుకునేందుకు ఎంతగానో ప్రయత్నించారు.. పార్టీని బలోపేతం చేసారు.. యువగళం పాదయాత్ర చేపట్టి రాష్ట్రమంతా పర్యటించి ప్రజల కష్టాలు తెలుసుకున్నాడు..
బీజేపీ,పవన్ కల్యాణ్ సపోర్ట్ కూడా తోడవటంతో 2024 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి తిరుగులేని విజయం సాధించింది.. లోకేష్ విద్యా, ఐటీ శాఖ మంత్రిగా భాద్యతలు చేపట్టారు.. విద్యాశాఖలో లోకేష్ సమూల మార్పులు తీసుకొచ్చారు.. గతంలో వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన 117 G.O రద్దు చేసి చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు.ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యే లక్ష్యంగా పలు కీలక మార్పులు సూచించారు.. టీచర్స్ బదిలీలు పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు.. ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి సమస్యలను పరిష్కరిస్తున్నారు.. లోకేష్ ముందు వున్న అతిపెద్ద టార్గెట్ మెగా డిఎస్సి నిర్వహించడం.. ఎన్నికల్లో మొదటి హామీగా డిఎస్సి నే ఇవ్వడంతో ఎలాగైనా రాష్ట్రంలో 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసి మాట నిలబెట్టుకోవాలని లోకేష్ భావిస్తున్నారు.. త్వరలోనే ఈ ప్రక్రియ కార్యరూపం దాల్చనుంది..