ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేర్వేరు అంశాల వెనుక కులం కీలక పాత్ర పోషిస్తుందా అనే ప్రశ్నకు అవుననే సమధానం వినిపిస్తుంది. ఏపీలో ఇప్పటికే కుల రాజకీయాలు నడుస్తున్నాయనే చర్చ సైతం జోరుగా జరుగుతోంది. ఏపీని ఒక విధంగా కుల రాజకీయాలు శాసిస్తున్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా మూడు కులాలు ఏపీ రాజకియాల్లో హాట్ టాపిక్ అవుతుండటం గమనార్హం.
 
కులం అనే ప్రాతిపదికన నిర్ణయాలు కొనసాగితి రాష్ట్రం అభివృద్ధి చెందడం కష్టమవుతుంది. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చినా చాలామంది కూటమి అనుకూల వ్యక్తులు ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ఆసక్తి చూపడం లేదు. వైసీపీ అనుకూల వ్యక్తులు సైతం రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు విషయంలో సానుకులంగా లేకపోవడానికి ఇదే కారణమని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
 
రాష్ట్రంలో పార్టీ అధికారం మారితే తమను వేధిస్తారనే కామెంట్లు వినిపిస్తుండటం నెట్టింట సంచలనం అవుతోంది. ఏపీలో ఈ పరిస్థితి మారాల్సిన అవసరం ఉంది. ఈ కులాలపై సానుకూల ధోరణి వల్ల ఇతర రాష్ట్రాల ప్రధాన నగరాల స్థాయిలో అభివృద్ధి జరగడం లేదు. ఏపీలో ఎప్పటికి పూర్తిస్థాయిలో అభివృద్ధి జరుగుతుందో చూడాల్సి ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
 
ఏపీలో పరిణాలు మారాల్సిన అవసరం అయితే ఉందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఏపీలో ఆశించిన స్థాయిలో సంక్షేమ పథకాల అమలు జరగడం లేదనే సంగతి తెలిసిందే. ఈ పరిస్థితి మారాల్సిన అవసరం అయితే ఉందని కొంతమంది సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు సైతం నెట్టింట తెగ వైరల్ అవుతుండటం గమనార్హం. ఆంధ్రప్రదేశ్ ప్రధాన రాజకీయ పార్టీల నేతలు మారితే మాత్రమే ఈ పరిస్థితిలో మార్పు వచ్చే అవకాశం అయితే కచ్చితంగా ఉంటుందని చెప్పవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయో అనే చర్చ సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది.






మరింత సమాచారం తెలుసుకోండి: