జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు అదిరిపోయే శుభవార్త అందింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కేంద్ర ఎన్నికల సంఘం అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఆయన ఆవిష్కరించిన జనసేన పార్టీకి ప్రత్యేక గుర్తింపు ఇచ్చింది కేంద్ర ఎన్నికల సంఘం. దాదాపు పది సంవత్సరాల తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది. ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో... అదే సమయంలో పార్లమెంట్ ఎన్నికల్లో కూడా 100కు 100%... స్ట్రైక్ రేట్ సంపాదించింది జనసేన పార్టీ.

 100కు 100% స్ట్రైక్ రేట్ సంపాదించడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో... ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేయడంలో జనసేన పార్టీ కీలక పాత్ర పోషించింది. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడానికి ముఖ్య కారణం జనసేన పార్టీ అన్న సంగతి తెలిసిందే. జనసేన పార్టీ లేకుంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యేవాడు కాదని ఇప్పటికీ అందరూ చెబుతూ ఉంటారు. పవన్ కళ్యాణ్ ముందు పడి కేంద్రాన్ని ఒప్పించి మరి కూటమి ఏర్పాటు చేశాడు.

 అయితే ఇలాంటి నేపథ్యంలో జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం అదిరిపోయో శుభవార్త చెప్పింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలలో... జనసేన పార్టీని కూడా తాజాగా చేర్చింది కేంద్ర ఎన్నికల సంఘం. అలాగే జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తును కూడా రిజర్వ్ చేయడం జరిగింది. ఇందులో భాగంగానే జనసేన పార్టీ అధినేత అలాగే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు కేంద్ర ఎన్నికల సంఘం లేఖ రాయడం జరిగింది.

 సార్వత్రిక ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్... సాధించిన నేపథ్యంలో గుర్తింపు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక కేంద్ర ఎన్నికల సంఘం నుంచి గుర్తింపు రావడంతో జనసేన  పార్టీ నాయకులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇది ఇలా ఉండగా మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో 21 అసెంబ్లీ స్థానంలో గ్రాండ్ విక్టరీ కొట్టింది జనసేన పార్టీ. అలాగే రెండు పార్లమెంటు స్థానాలు కూడా గెలుచుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: