జిహెచ్ఎంసి మేయర్ విజయలక్ష్మి కి పదవి గండం వచ్చినట్లే కనిపిస్తోంది. గులాబీ పార్టీ తరఫున టికెట్ తీసుకొని... ఆ పార్టీ ఇచ్చిన పదవులు అనుభవిస్తున్న జిహెచ్ఎంసి మేయర్ విజయలక్ష్మి కి త్వరలోనే షాక్ ఇచ్చేందుకు గులాబీ పార్టీ రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. మేయర్ విజయలక్ష్మిపై... ఇప్పటికే చాలా ఆరోపణలు, ఆమె చుట్టూ వివాదాలు తిరుగుతున్నాయి. ముఖ్యంగా గులాబీ పార్టీని కాదని కాంగ్రెస్ పార్టీలో ఆమె చేరడం వివాదంగా మారిన సంగతి తెలిసిందే.

 అయితే గులాబీ పార్టీని వీడిన తర్వాత... ఆమెపై రగిలిపోతుంది గులాబీ క్యాడర్. అయితే ఇప్పుడు హైదరాబాద్ మేయర్ పదవి తొలగించేందుకు గులాబీ పార్టీ కొత్త ప్లాన్ వేసినట్లు సమాచారం అందుతుంది. ఆమెపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు సిద్ధమవుతుందట గులాబీ పార్టీ. కాంగ్రెస్ పార్టీలో చేరిన విజయలక్ష్మిపై అవిశ్వాసం తీర్మానం పెట్టి... ఆమె పదవి తొలగించాలని డిసైడ్ అయిందట.

 ఇందులో భాగంగానే నిన్నటి రోజున హైదరాబాద్లోని సనత్ నగర్ ఎమ్మెల్యే... తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంట్లో... ఎమ్మెల్యేలందరూ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మేయర్ విజయలక్ష్మిపై అవిశ్వాసం పెట్టేందుకు... ఎలా ముందుకు వెళ్లాలి అనే దానిపై చర్చించినట్లు సమాచారం అందుతోంది. ప్రస్తుతానికి... గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీలో... కార్పొరేటర్లు అలాగే ఎక్స్ అఫీషియో మెంబర్స్ అందరూ 198 మంది ఉన్నారు.

 ఇందులో గులాబీ పార్టీకి 98 మంది మద్దతు ఉంటేనే అవిశ్వాసానికి ప్రిసైడింగ్ అధికారి అనుమతి ఇవ్వడం జరుగుతుంది. కానీ ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం గులాబీ పార్టీ మద్దతుదారుల సంఖ్య 80 మాత్రమే ఉండడం గమనార్హం. ఇలాంటి నేపథ్యంలో గులాబీ పార్టీ ఎలా అవిశ్వాస తీర్మానం పెడుతుందనే దానిపై కూడా కొత్త చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ లో ఉన్న వారు కూడా గులాబీ పార్టీకి సపోర్ట్ చేస్తారని ఒక వాదన వస్తోంది. నేడో, రేపో అవిశ్వాస తీర్మానం పెడుతుందని అంటున్నారు గులాబీ నేతలు. 

మరింత సమాచారం తెలుసుకోండి: