ఏపీ రాజకీయ నేతలలో ఒకరైన లోకేశ్ తన ప్రతిభతో పార్టీపై పూర్తిస్థాయిలో పట్టు సాధించిన సంగతి తెలిసిందే. ఏపీ మంత్రి లోకేశ్ ప్రపంచ ఆర్థిక సదస్సులో భాగంగా దావోస్ కు వెళ్లారు. పర్యావరణ పరిరక్షణ వాతావరణ ఉద్యమ భవిష్యత్ అంశం గురించి లోకేశ్ సమావేశంలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో ఏపీ విద్యా వ్యవస్థ అభివృద్ధి కోసం లోకేశ్ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది.
 
లోకేశ్ విజన్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. మరోవైపు డిప్యూటీ సీఎం పదవి గురించి జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో లోకేశ్ తనకు ఉన్న పదవితో సంతృప్తితో ఉన్నాననే అర్థం వచ్చేలా కామెంట్లు చేయగా ఆ కామెంట్లు నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి. నారా లోకేశ్ రాజకీయాలలో తనదైన ముద్ర వేస్తూ ప్రశంసలు అందుకుంటూ వార్తల్లో నిలుస్తుండటం గమనార్హం.
 
నారా లోకేశ్ సోషల్ మీడియాలో సైతం యాక్టివ్ గా ఉంటారనే సంగతి తెలిసిందే. ఎక్స్ లో నారా లోకేశ్ కు ఏకంగా 11 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఈ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న రాజకీయ నేతలు చాలా తక్కువమంది ఉన్నారని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఇతర రాజకీయ నేతలు సైతం లోకేశ్ ఫ్యాన్ ఫాలోయింగ్ చూసి షాకవుతున్నారు.
 
నారా లోకేశ్ ఇస్తున్న సలహాలు, సూచనలు పార్టీకి ఎంతగానో ఉపయోగపడుతున్నాయని చెప్పడంలో సందేహం అవసరం లేదు. నారా లోకేశ్ భవిష్యత్తులో సీఎం కావాలని అభిమానులు కోరుకుంటున్నారు. నారా లోకేశ్ సరైన ప్రణాళికలతో ముందుకెళ్తూ పొలిటికల్ కెరీర్ పరంగా సత్తా చాటుతున్నారు. నారా లోకేశ్ కార్యకర్తలకు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంటూ పార్టీకి ఎంతగానో మేలు చేస్తున్నారు. నారా లోకేశ్ ఇంతింతై వటుడింతై ఎదుగుతూ ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి. నారా లోకేశ్ విజన్ సైతం అద్భుతం అని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వినిపిస్తున్నాయి.




 


మరింత సమాచారం తెలుసుకోండి: