నారా లోకేష్  ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకుంటున్నారు. ఎంతో ఉన్నతమైన రాజకీయ కుటుంబంలో పుట్టిన ఈయనకు అలాంటి ఫీలింగ్ ఏది లేకుండా చాలా సాదాసీదాగా ఉంటారు.. తన తాత, తండ్రిలాగే ఎప్పుడు ప్రజల కోసం పరితపించే వ్యక్తి. అలాంటి నారా లోకేష్ చిన్నతనం నుంచి ఏం చేశాడు.. ఎక్కడ చదివాడు..ఆయనను రాజకీయాల్లోకి రావడానికి ఇన్ఫ్లుయెన్స్ చేసింది ఎవరు? ఆ వివరాలు ఏంటో చూద్దాం..

 నారా లోకేష్ బాల్యం:
లోకేష్ 1983 జనవరి 23వ తేదీన భువనేశ్వరి చంద్రబాబు దంపతులకు జన్మించాడు..అప్పటికే ఎంతో ఉన్నతంగా ఎదిగినటువంటి నారా చంద్రబాబు నారా లోకేష్ పుట్టిన తర్వాత మరో సంతానాన్ని పొందలేదు. నారా లోకేష్ ను మాత్రమే పెంచుతూ  పెద్ద చేశాడు. ఈయన చిన్నతనం అంతా హైదరాబాదులోనే సాగింది. ఆ తర్వాత పై చదువుల కోసం  స్టాన్ ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో చేరి ఎంబీఏ కంప్లీట్ చేశాడు. ఆ తర్వాత కార్నైగి మెలను యూనివర్సిటీ నుంచి ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ విభాగంలో బీఎస్సీ కంప్లీట్ చేశాడు.. అప్పటికే తన తండ్రి సీఎం కావడంతో ఆయనకు ఎంతో సెక్యూరిటీ మరియు క్రమశిక్షణ ఉండేది. అలా విద్యాభ్యాసాన్ని కంప్లీట్ చేసుకుని, కొన్నాళ్లపాటు ఇతర దేశాల్లో జాబ్స్ చేసి ఆ తర్వాత ఇండియాకు వచ్చారు. చివరికి తన సొంత కంపెనీ అయినటువంటి హెరిటేజ్ లో కీలకమైన బాధ్యతలు పోషిస్తూ వ్యాపారాలన్నీ చూసుకుంటూ తెలుగు రాష్ట్రాల్లో మంచి పేరు సంపాదించుకున్నారు.. ఇక చివరికి తన మేనమామ కూతురు అయినటువంటి బ్రాహ్మణిని పెళ్లి చేసుకొని  వ్యాపార సముదాయాలన్నీ ఆమెకు అప్పగించి  రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు.. ఇంతలోనే ఈ ఇద్దరి దంపతులకు ఒక బాబు పుట్టాడు ఆయనే దేవాన్ష్..

 రాజకీయ ప్రస్థానం:
 హెరిటేజ్ సంస్థకు అధినేతగా ఉన్న సమయంలోనే చాలామంది రాజకీయాల్లోకి వస్తే బాగుంటుందని సజెస్ట్ చేశారట. 2013లో  టిడిపి తీర్థం పుచ్చుకున్న నారా లోకేష్, ఆ తర్వాత  యువ నాయకుడిగా యువజన విభాగానికి కొన్నాళ్లు నేతృత్వం వహించారు.. ఇదే టైములో 2009 టిడిపి మేనిఫెస్టో తయారీలో కీలక పాత్ర పోషించారట. ముఖ్యంగా ఇందులో నగదు బదిలీ అనే ఆలోచన లోకేష్ కే వచ్చిందని అప్పట్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు. అలా మెల్లిమెల్లిగా రాష్ట్రంలో ఎదుగుతూ మంచి పేరు తెచ్చుకున్నారు. 2014 సంవత్సరంలో టిడిపి గెలుపులో కీలకమైన పాత్ర పోషించారని చెప్పవచ్చు. ఆ తర్వాత ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రివర్గంలోకి తీసుకొని పంచాయతీ ఐటీ శాఖకు మంత్రిగా ప్రకటించారు. ఇదే సమయంలో ఆయన గ్రామాల్లో ప్రతి ఇంటికి ఇంటర్నెట్ అందాలని చెప్పి కేంద్ర ప్రభుత్వ సహకారంతో గ్రామాల్లోకి కూడా వైఫై సౌకర్యాన్ని అందించే విధంగా కృషి చేశారు. 2019 ఎన్నికల్లో కూడా మంగళగిరి నుంచి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు.. అయినా మంగళగిరిని వదిలిపెట్టకుండా  ఐదు సంవత్సరాలపాటు అక్కడే ఉంటూ సేవా కార్యక్రమాలు చేస్తూ నేనున్నానంటూ అందరి తలుపు తట్టాడు.. అక్కడ గెలిచిన ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కంటే ఎక్కువ లోకేష్ పేరే అయిదేళ్లు మారుమోగింది.
 
 యువగళంతో ప్రజల్లో జోష్:
 ఇక లోకేష్ టిడిపిని అధికారంలోకి తీసుకురావడానికి ఎంతో కష్టపడ్డారని చెప్పవచ్చు. ముఖ్యంగా యువగళం అనే పాదయాత్ర ద్వారా కొన్ని వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల్లో టిడిపిపై పట్టు ఏర్పడేలా చేశాడు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో జరిగిన అన్యాయాలను ప్రశ్నిస్తూ, వారు అధికారంలోకి వస్తే ఏం చేస్తామో ప్రజలకు తెలియజేశారు. గ్రామ గ్రామంలో తిరుగుతూ ప్రజా సమస్యలు తెలుసుకున్నాడు. చిత్తూరు జిల్లాలో పాదయాత్ర ప్రారంభించి మొత్తం 11 జిల్లాలు 97 అసెంబ్లీ నియోజకవర్గాలు తిరిగాడు. 226 రోజులపాటు సాగిన ఈ పాదయాత్ర 3,132 కిలోమీటర్లు కొనసాగింది. అలా ప్రతి గ్రామం, ప్రతి వాడ తిరుగుతూ ప్రతి మనిషిని కదిలిస్తూ తనదైన శైలిలో దూసుకెళ్లారని చెప్పవచ్చు. ఈ విధంగా యువగళం ద్వారా టిడిపికి పూర్వ వైభవం తేవడంలో లోకేష్ కీలక పాత్ర పోషించారని చెప్పవచ్చు. ఈయన పాదయాత్ర ద్వారానే  పార్టీ అధికారంలోకి వచ్చిందని చెప్పకనే చెప్పవచ్చు.

 మంగళగిరిలో గెలుపు :
2024 ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసి  భారీ మెజారిటీతో గెలుపొంది ప్రస్తుతం ఏపీ క్యాబినెట్ లో ఐటీ మినిస్టర్ గా సేవలందిస్తున్నారు.. ఎక్కడ ఏ ఇబ్బంది ఏర్పడిన, నేనున్నా అంటూ ప్రజల ముందు ఉంటాడు. ముఖ్యంగా చదువుకునే పిల్లలకు ఏ సమస్య వచ్చిన ఫోన్ వాట్సాప్ ద్వారా సమస్య తెలియజేసిన వెంటనే స్పందించడంలో దిట్ట.. ఈ విధంగా తాతకు తగ్గ మనవడిగా, తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకుంటున్నారు నారా లోకేష్.. అలాంటి ఈయనకు అడ్వాన్సుగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తోంది  ఇండియన్ హెరాల్డ్..

మరింత సమాచారం తెలుసుకోండి: