సీనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు చేతుల్లోకి తీసుకున్నాక ఎన్టీఆర్ లాగే ఎన్నో పథకాలు తీసుకువచ్చి తెలుగు రాష్ట్రాల ప్రజల్లో నాయకుడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఈయన టిడిపి పార్టీని ముందుకు నడిపిస్తూ గత ఏడాది బిజెపి జనసేనతో పొత్తు పెట్టుకుని టిడిపి కూటమిగా అవతరించి భారీ బంపర్ మెజార్టీతో అధికారంలోకి వచ్చారు.ఇక టీడీపీ అధికారంలోకి రావడానికి చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్ కూడా ఓ కారణమయ్యారు. లోకేష్ తన యువగళం  పాదయాత్రతో ఎంతో మంది యూత్ ని టన స్పీచ్ తో ఆకట్టుకున్నారు.. అయితే అలాంటి నారా లోకేష్ ది రేపు అనగా జనవరి 23న బర్త్డే కావడంతో ఆయన గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.. 

అయితే లోకేష్ బర్త్ డే సందర్భంగా ఆయన ప్రేమ పెళ్లి గురించి ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ చూద్దాం. నారా లోకేష్ తన మేనమామ అయినటువంటి నందమూరి బాలకృష్ణ పెద్దకూతురు బ్రాహ్మిణిని పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. అయితే వీరు వీరిద్దరూ సొంత బావ మరదలళ్లు కాబట్టి పెళ్లికి ముందే పరిచయం ఉంటుంది. అలా పెళ్లికి ముందే బ్రాహ్మణిని నారా లోకేష్ గాఢంగా ప్రేమించారట. కానీ ఈ విషయాన్ని బయటికి చెప్పడానికి లోకేష్ భయపడేవారట.ఎందుకంటే బాలకృష్ణ ని చూస్తే లోకేష్ లో ఏదో తెలియని భయం ఉండేదట. అందుకే మామయ్యకు భయపడి లోకేష్ తన ప్రేమ విషయాన్ని బయట పెట్టలేదట.

కానీ ఆ తర్వాత ఓసారి ఫ్యామిలీ వెకేషన్ కి వెళ్ళిన సమయంలో లోకేష్ కి బ్రాహ్మిణిని ఇచ్చి పెళ్లి చేద్దామని బాలకృష్ణ చంద్రబాబు నాయుడు అనుకోవడంతో ఈ విషయాన్ని భువనేశ్వరి లోకేష్ కి చెప్పి మేము ఇలా పెళ్లి చేయాలి అనుకుంటున్నాం నీకు ఇష్టమేనా అని లోకేష్ ని అడిగిందట. ఇక ఎప్పటినుండో బ్రాహ్మణిని ప్రేమిస్తున్న లోకేష్ నాకు ఇష్టమే అని చెప్పారట.ఇక బ్రాహ్మణి వైపు నుండి కూడా ఓకే అని సమాధానం రావడంతో వీరిద్దరి పెళ్లి ఆగస్టు 26, 2007లో జరిగింది. కాగా వీరి పెళ్లి  అయ్యి దాదాపు 18 సంవత్సరాలు అవుతుంది. ఇక ఈ జంటకు దేవాన్ష్ అనే తనయుడు కూడా ఉన్నారు. ప్రస్తుతం నారా లోకేష్ టిడిపి పార్టీలో ఐటి మినిస్టర్ గా కొనసాగుతున్నారు.అలాగే నారా బ్రాహ్మిణి నారా ఫ్యామిలీకి సంబంధించిన పలు బిజినెస్ లను చూసుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: