సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్ గా ఉంటూ పలు విషయాలపైన మాట్లాడుతూ ఉంటారు మహాసేన రాజేష్.. మొదట్లో ఈయన వైసీపీ పార్టీకి సపోర్టుగా ఉండి ఎక్కువగా చేసేవారు.ఆ తర్వాత పార్టీ నుంచి బయటికి వచ్చి జనసేన పార్టీ వైపుగా అడుగులు వేసినప్పటికీ ఆ పార్టీలోకి వారు చేర్చుకోలేదు. ఆ తరువాత కొన్ని రోజులకు టీడీపీ పార్టీలోకి చేరారు. పి గన్నవరం ఎమ్మెల్యే టికెట్ గా కూడా ఈయనకు టిడిపి పార్టీ అవకాశం ఇచ్చిన.. తన స్వగ్రామం నుంచి చాలా తీవ్రమైన వ్యతిరేకత ఎదురయ్యింది. ఆ సమయంలో ఈయన చాలా నిరాశకు గురయ్యారు.


ముఖ్యంగా జనసైనికుల మీద అప్పుడప్పుడు తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. అయితే గత వారం రోజులుగా మళ్లీ సోషల్ మీడియాలో యాక్టివ్గా అయ్యి నారా లోకేష్ ని డిప్యూటీ సీఎం చేయాలి అంటూ ఒక వీడియోని వైరల్ చేశారు. దీంతో చాలామంది కూటమిలో ఈయనకు వ్యతిరేకంగా మాట్లాడడం జరగదు మరి కొంతమంది నేతలు సపోర్టివ్ గా రాజకీయాలలో లోకేష్ డిప్యూటీ సీఎం అంటూ తెర లేపారు. ఈ విషయాన్ని టిడిపి నేతలు పైకి లేపడంతో జనసేన నాయకులు తమ అధినేతను ముఖ్యమంత్రి చేయాలి అంటూ డిమాండ్ చేశారట.



దీంతో ఇలా ఇరు పక్షాల మధ్య ఒక గందరగోళం నెలకొంది. అయితే ఇలాంటి వాతావరణానికి తెరలేపింది  మహాసేన రాజేష్. సుమారుగా ఒక పది రోజులపాటు కూటమిలో ఈ విషయం ఒక ప్రకంపాన్ని సృష్టించింది ఈ విషయాన్ని గమనించిన టిడిపి కూటమి విచ్ఛిన్నమవుతుందని గ్రహించి ఈ విషయాలకు పుల్ స్టాప్ పెట్టింది. అంతేకాకుండా ఈ విషయానికి ఆద్యం పోసినటువంటి మహాసేన రాజేష్ పైన అధిష్టానం కాస్త ఫైర్ అవుతున్నట్లు తెలుస్తోంది.. ఎలాంటి క్షణంలోనైనా ఇతడిని సస్పెండ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: