ఎంపీ ఈటల రాజేందర్ ఓ రియల్ ఎస్టేట్ వ్యక్తిని కొట్టిన ఘటన సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. సీనియర్ పొలిటీషియన్ ఎందుకు ఇలా చేశారనే ప్రశ్నలు ఎదురైన సమయంలో ఈటల ఈ మేరకు క్లారిటీ ఇచ్చారు. మీడియాతో మాట్లాడుతూ ఎంపీ వచ్చి ఏం పీకుతాడు అని మాట్లాడారట అంట అంటూ తన చర్య వెనుక కారణాన్ని వివరించారు.


'ఏకశిలా నగర్ లో 700 ఇల్లు ఉన్నాయి. మిగిలిన వారు ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ కి వెళ్తే అనుమతి ఇవ్వడం లేదు.  మున్సిపాలిటీ LRS ఇవ్వడం లేదు. రియల్ ఎస్టేట్ బ్రోకర్ స్థానిక నాయకులను పట్టుకొని వందమంది గుండాలను, 10 కుక్కలను పెట్టి మరి ఈ ఏకశిలా నగర్ వాసులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు.  ఆడవాళ్లను ఇష్టమొచ్చినట్లు తిడుతున్నారు, దౌర్జన్యం చేస్తున్నారు. గుండాలు ఎంత బెదిరించినా సంయమనం పాటించి పోలీస్ స్టేషన్ కి వెళ్లి బాధితులు కేసులు పెడుతున్నారు.


పోచారం పోలీస్ స్టేషన్ ఎస్ఐ సీఐ వాళ్లకే సపోర్ట్ చేస్తున్నారు. వాని ఎంగిలి మెతుకులకు ఆశపడి కబ్జాదారును పక్షం వహిస్తున్నారు తప్ప పేదల పక్షాన ఆలోచన చేయలేదు. నిన్న నా దగ్గరికి బాధితులందరూ వచ్చి వారిని పెడుతున్న ఇబ్బందులను మొరపెట్టుకున్నారు.  కలెక్టర్ కి ఫోన్ చేసి రోజు ఏదో ఒక కబ్జా మీద ఫోన్ చేయాల్సి వస్తుంది. మీరేం చేస్తున్నట్టు అని అడిగాను. నేనే స్వయంగా ఈరోజు వస్తా అని చెప్పా.. రాత్రిపూట వాళ్ల గుండాలు ఎంపీ వచ్చి ఏం పీకుతాడు అని చెప్పి మహిళలను బెదిరించారు.' అంటూ ఈటల వివరణ ఇచ్చారు.


పోలీసు ధర్మాన్ని కాపాడటంలో విఫలమైనప్పుడు..రెవెన్యూ అధికారులు విఫలమైనప్పుడు..ప్రజల ఓట్లతో గడిచిన బిడ్డగా..ధర్మాన్ని కాపాడటానికి..వాళ్లకు అండగా ఉండడానికి వానికి పనిష్మెంట్ ఇచ్చాను. నేను దీనిని తప్పుగా భావించడం లేదు. ` అంటూ ఈటల వివరణ ఇచ్చారు.


నా 25 సంవత్సరాల జీవితంలో ఎవరిమీద చేయెత్తలేదు. బూతులు తిట్టలేదు. కానీ ఈరోజు వ్యవస్థ చూసి ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని అడుగుతున్న మీ నాయకుల అండదండలతో ఇదంతా జరుగుతుందని ప్రచారం జరుగుతుంది.  నిజంగా నీకు ప్రజల మీద ప్రేమ ఉంటే, వారిని రక్షించాలి అనుకుంటే సంపూర్ణమైన ఎంక్వయిరీ చేసి ఎవరి జాగాలని వారికి ఇప్పించే ప్రయత్నం చేయాలని ఈటల సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: