మనదేశంలోని మహిళా ఓటర్లకు సంబంధించిన ఆసక్తికర విషయాలను ఎస్ బీఐ రీసెర్చ్ రిపోర్ట్ తాజాగా విడుదల చేసింది .. ఇందులో మన రాష్ట్రాల వారీగా బయటికి వచ్చిన వివరాలన్నీ చూసినప్పుడు పురుష ఓటర్ల కంటే మహిళ ఓటర్లు ఎక్కువగా ఉండే రాష్ట్రాలు మాత్రమే కాకుండా .. పురుష ఓటర్లకు చాలా తక్కువగా మహిళ ఓటర్లు ఉన్న రాష్ట్రాలు కూడా కొన్ని ఉన్నాయి. ఇప్పుడు తాజాగా ఎన్నికల సంఘం రాష్ట్రాల వారీగా ఓటర్ల వివరాలని విడుదల చేస్తుంది .. ఈ నేపథ్యంలో ఆ వివరాలతో ఈ నివేదికను వారు సిద్ధం చేశారు. పురుష ఓటర్లు .. మహిళా ఓటర్ల మధ్య ఉన్న తేడాలు కొన్ని రాష్ట్రాల్లో షాక్ ఇచ్చేలా ఉండటం గమనార్హం .. మనదేశంలోని 12 రాష్ట్రాల్లో పురుష ఓటర్ల కంటే మహిళ ఓటర్లు అధికంగా ఉన్నారు ..


 అలాగే ఐదు రాష్ట్రాల్లో పురుష ఓటర్లు మహిళా ఓటర్లు సమానంగా కనిపిస్తున్నారు .. ఇదే క్రమంలో కేరళ, అరుణాచల్ ప్రదేశ్లో ప్రతి 100 మంది పురుష ఓటర్లకు 109 మంది మహిళ ఓటర్లు ఉన్నారు .. అలాగే మేఘాలయ , మణిపూర్ , గోవా రాష్ట్రాల్లో ప్రతి 100 మంది పురుష ఓటర్లకు 108 మంది .. అలాగే మన ఆంధ్రప్రదేశ్లో ప్రతి 100 మంది పురుష ఓటర్లకు 103 చొప్పున మహిళ ఓటర్లు ఉన్నారు.. మన దేశ రాజధాని ఢిల్లీ .. అలాగే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రాతినిధ్యం వహించే గుజరాత్ రాష్ట్రాల్లో మాత్రం ప్రతి 10 మంది పురుష ఓటర్లకు కేవలం 84 మంది మహిళ ఓటర్లు మాత్రమే ఉన్నట్టుగా ఈ రిపోర్టు చెప్పుకొస్తుంది .. అలాగే మన దేశం మొత్తం మీద చూస్తే  పురుష ఓట‌ర్ల‌లు ఎక్కువగా ఉన్నారు .. ఇదే క్రమంలో దేశం మొత్తం మీద పురుష ఓటర్లు వర్సెస్ మహిళ ఓటర్ల లెక్కలను చూస్తే .. ప్రతి 100 మంది పురుష ఓటర్లకు 95 మంది మహిళ ఓటర్లు ఉండటం గమనార్హం ..


అదే విధంగా పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లు ఎక్కువగా ఉండే టాప్ 5 రాష్ట్రాలు .. ఇదే క్రమంలో పురుష ఓట‌ర్ల కంటే మహిళ ఓటర్లు చాలా తక్కువగా ఉండే ఐదు రాష్ట్రాలన్నీ చూస్తే.. ప్రతి వంద మంది పురుష ఓటర్లకు మహిళా ఓటర్లు ఎక్కువగా ఉండే టాప్ 5 రాష్ట్రాల్ని చూస్తే.. రాష్ట్రం మహిళా ఓటర్లు అరుణాచల్ ప్రదేశ్ 109 , కేరళ 109 , గోవా 108 , మేఘాలయ 108 , మణిపూర్ 108 అతి తక్కువగా మహిళా ఓటర్లు ఉండే ఐదు రాష్ట్రాలు ఢిల్లీ 84 , హర్యానా 84 , గుజరాత్ 84 , మహారాష్ట్ర 86 , మధ్యప్రదేశ్ 88అలాగే మన రెండు తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే .. ఇక్కడ కూడా ప్రతి 100 మంది పురుష ఓటర్లకు 13 మంది మహిళా ఓటర్లు ఉంటే .. ఒక తెలంగాణలో మాత్రం ప్రతి వంద మంది పురుష ఓటర్లకు 100 మంది మహిళ ఓటర్లు ఉండటం మరో విశేషం .. అలాగే దేశంలోని మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మన సౌత్ రాష్ట్రాల్లోనే మహిళ ఓటర్లు అధికంగా ఉన్నారనే విషయం రిపోర్టు చెబుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: