ఒకపక్క మాస్ రాజకీయ నాయకుడిగా తన పార్టీ కార్యకర్తల సంక్షేయమే తన దేయంగా.. మరొ పక్క తన రాష్ట్ర ప్రజల సుఖ సంతోషాలే అంతిమ లక్ష్యంగా పనిచేసుకుంటూ వెళ్తున్న లోకేష్ .. ఎప్పుడు పెద్దగా ఆర్భాటాలకు వెళ్లిన దాఖాలాలు ఎక్కడ కనిపించలేదని చెప్పాలి .. ఇప్పుడు తెల్లని చొక్కా దాని మీద బ్లూ బ్లాక్ ప్యాంటులో కనిపించే లోకేష్ .. ఏ ప్రాంతానికి వెళ్లిన ఎక్కడి వెళ్లినా ఇదే డ్రెస్ లో కనిపిస్తారు .. ఈ డ్రెస్ ను అయినా ఒక యూనిఫామ్ గా ఎంచుకున్నారని కూడా చెప్పవచ్చు. మొన్నటి వరకు అమెరికా పర్యటనలో కూడా లోకేష్ ఇదే డ్రెస్ లో కనిపించారు.
అయితే ఎప్పుడు ప్రతి సంవత్సరం దావోస్ కేంద్రంగా జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో మాత్రం ఈసారి తనలోని ఫ్యాషన్ సెన్సును లోకేష్ బయటకు తీశారు .. ప్రపంచంలో ఉన్న అగ్ర కంపెనీలన్ని దావోస్ సదస్సుకు హాజరవుతాయి .. అంటే ప్రపంచంలో ఉన్న దాదాపు అన్ని దేశాలకు చెందిన బడా కంపెనీ ప్రతినిధులు ఈ సదస్కు వస్తారు .. అంటే ఈ సదస్సు భిన్న రకాల అభిరుచులకు నిలువగా అందరికీ కనిపిస్తుంది .. ఇలాంటి ఓ అరుదైన వేదికపై తనని తాను ఒక కొత్తగా చూపించుకోవాలనే క్రమంలో లోకేష్ ఈ విధంగా సరికొత్త డ్రెస్సింగ్ సెన్స్ ను ఎంచుకున్నట్లు తెలుస్తుంది .. ఈ సదస్సు లో మొదటి రోజు కలర్ఫుల్ డ్రస్సులో కనిపించిన లోకేష్ .. రెండో రోజు కూడ ఊహించని సూట్ లో దర్శనమిచ్చి .. అక్కడ ఉన్న అందరి దృష్టిని ఆకర్షించారు. ప్రస్తుతం లోకేష్ ఫ్యాషన్ సెన్స్ హాట్ టాపిక్ గా మారింది.