ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి చేపట్టిన తర్వాత సూపర్ సెక్స్ హామీలను అమలు చేయడం పైన ప్రత్యేకమైన దృష్టి పెట్టినట్టుగా కనిపిస్తున్నది. ఇందులో భాగంగా మెగా డీఎస్సీ ని మొదట ప్రకటించారు. కానీ ఇప్పట్లో వాటిని విడుదల చేయలేదు. దీంతో ఒక్కసారిగా కూటమి ప్రభుత్వం ఇమేజ్ తగ్గిపోయింది. దీంతో నిరుద్యోగులలో కూడా అసంతృప్తి కనిపిస్తున్నట్లు సమాచారం. అలాగే మరొకటి ఉచిత గ్యాస్ పథకాన్ని కూడా గత ఏడాది డిసెంబర్ నుంచి అమలు చేశారు. అర్హులు ఉన్న ప్రతి కుటుంబానికి కూడా ఏడాదికి మూడు సిలిండర్లు ఇస్తామంటూ తెలిపారు.


అయితే ఈ పథకాన్ని అమలు చేసినప్పటికీ మహిళలు ఆనందంగా ఉండి కూటమికి మైలేజ్ వస్తుందనుకుండం జరిగిందట.. ఈ పథకం ప్రారంభించి 50 రోజుల తర్వాత ఒక సమీక్షను (ఫీడ్బ్యాక్ )తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదే ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని డైలామాలోపడేసాయట. పోయే సొమ్ము పోతున్నప్పటికీ మైలేజ్ మాత్రం కావలసినంత రాలేదని మంత్రులు కూడా ఆవేదన చెందుతున్నారు. ఇందుకు కారణం ప్రజలు ముందుగా డబ్బులు చెల్లించి సిలిండర్ తీసుకోవడమే ముఖ్య కారణం అన్నట్లుగా తెలియజేస్తున్నారు.


మరొకటి క్షేత్రస్థాయిలో జరుగుతున్నటువంటి తప్పుల వల్లే లబ్ధిదారులు చాలామంది సిలిండర్ సొమ్ములు వారి ఖాతాలోకి జమ కావడం లేదట.. దీంతో ఈ పథకం కూడా నీరు కారిపోయిందనే విధంగా మంత్రులు మాట్లాడుకుంటున్నారు. ఈ పథకం పై అటు పార్టీ నేతలు, సీఎం స్థాయిలో కూడా చంద్రబాబు ఆందోళన చెందుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పెట్టిన నిబంధనలను కూడా తీసివేయాలని ఆలోచనలో ఉన్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయం పైన కేంద్రం స్పందించకపోవడంతో చంద్రబాబు ఎలాంటి నిర్ణయాలను తీసుకుంటారో చూడాలి. మొత్తానికి పథకాన్ని అమలు చేసిన కూడా మైలేజ్ పెరగలేదని కూటమి ప్రభుత్వానికి అర్థమయ్యింది. మరి రాబోయే రోజుల్లో సూపర్ సిక్స్ హామీలకు ఎలాంటి మైలేజ్ వస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: