ఇక హరీష్ కుమార్ గుప్తా కంటే మాదిరెడ్డి ప్రతాపరెడ్డి అనే ఐపీఎస్ సీనియర్గా ఉన్నారు .. కానీ వైయస్ కుటుంబ భక్తుడు .. జగన్ రెడ్డి హయాంలో పలు కీలక పోస్టులు ఆయనకి ఇస్తే ఆ సమయంలో ఆయన చేసిన రచ్చ చూసి వైసిపి కూడా అయను వదిలించుకున్నారు .. తర్వాత ఆయనపై కేసులు పెట్టారు .. కానీ చివరకు రీసెంట్ గానే ఆయన సీనియారిటీకి గౌరవం ఇచ్చి .. కూటమి ప్రభుత్వం ఆ కేసులన్నీ వెనక్కి తీసుకున్నారు .. అయితే ఇప్పుడు ఆయన పేరును డీజీపీ పోస్టుకు పరిశీలన చేసే అవకాశం కూడా లేదు .. ఇక ఆయన తర్వాత స్థానంలో హరీష్ కుమార్ గుప్తా ఉన్నారు .
గత ఎన్నికల సమయంలో డీజీపీ గా ఉన్న రాజేందర్ నాథ్ రెడ్డిని ఈసీ బదిలీ చేయడం తో గుప్తా డిజిపి అయ్యారు .. ఎన్నికల తర్వాత కూడా ఆయనే అలా కొనసాగారు కానీ .. తర్వాత ద్వారకా తిరుమలరావుకు అవకాశం ఇవ్వాలని ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఆయనకు ఆ ఛాన్స్ ఇచ్చారు .. ఇప్పుడు డీజీపీగా ద్వారకా తిరుమలరావు రిటైర్ అవుతున్నారు .. ఇప్పుడు మరోసారి గుప్తాకు మళ్లీ డీజీపీ హోదా రాబోతుంది .. ఈ విధంగా సీనియర్ ఐపీఎస్ ల గౌరవాన్ని చంద్రబాబు ప్రభుత్వం కాపాడుతుంది . జగన్ ప్రభుత్వంలో మాదిరిగా సీనియారిటీలో ఎక్కడో ఉన్న రాజేందర్ నాథ్ రెడ్డి , జవహర్ రెడ్డిలను రెడ్డిలు కారణంగా డీజీపీ, సీఎస్‌లుగా నియమించి మిగిలిన వారిని కించపరిచారు . కానీ ఇప్పుడు చంద్రబాబు సీనియారిటీకే పెద్ద పీఠ వేస్తున్నారన్నది వాస్తవం.