ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో... ఇప్పుడు మంత్రి నారా లోకేష్ స్మరణం నడుస్తోంది. తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన మంత్రి నారా లోకేష్... తాను పప్పు కాదు నిప్పు అని నిరూపించాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు వారసుడిగా నారా లోకేష్ రాజకీయాల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. అలా రాజకీయాల్లోకి వచ్చిన నారా లోకేష్... ఒకే ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచారు. అంతకుముందు 2014 సంవత్సరంలో ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు.

 

ఆ సమయంలో ఎమ్మెల్సీ పదవి తీసుకుని మంత్రివర్గంలోకి నారా లోకేష్ వచ్చారు.. దాంతో నారా లోకేష్ పై విపరీతంగా ట్రోలింగ్ జరిగింది. నారా లోకేష్ ముద్దపప్పు అంటూ వైసీపీ నేతలు దారుణంగా మాట్లాడారు. వార్డ్ మెంబర్గా కూడా గెలవలేని నారా లోకేష్ కు మంత్రి పదవి ఇచ్చారని... సెటైర్లు పేల్చింది వైసిపి. అయితే తానేంటో నిరూపించుకోవాలని 2019లో ప్రయత్నాలు చేశారు నారా లోకేష్. ఇందులో భాగంగానే మంగళగిరి నియోజకవర్గం నుంచి బరిలో దిగారు.

 

అయితే అక్కడ దాదాపు 30 సంవత్సరాలకు పైగా టిడిపి గెలువని పరిస్థితి. అలాంటి నియోజకవర్గంలో వైసిపి చేతిలో నారా లోకేష్ ఓడిపోయారు. దీంతో నారా లోకేష్.. నిప్పు కాదు పప్పు అని మళ్లీ వైసీపీ నేతలు ర్యాగింగ్ చేశారు. అయితే ఎక్కడ పడ్డాడో అక్కడే తెలుసుకోవాలని నారా లోకేష్ డిసైడ్ అయ్యారు. ఓడిపోయానని మంగళగిరి నీ వదిలిపెట్టలేదు నారా లోకేష్. కసిగా ఈసారి పోరాడాడు.

 

పాదయాత్ర చేశాడు.  చివరికి 2024 అసెంబ్లీ ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గ నుంచి... దాదాపు 91 వేల మెజారిటీతో గ్రాండ్ విక్టరీ కొట్టాడు ఉన్నారా లోకేష్. అదే సమయంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రెండు మంత్రి పదవులు దక్కాయి. ఇలా వైసిపి నేతల నోర్లు మూయించాడు నారా లోకేష్. తాను పప్పు కాదు నిప్పు అని తేల్చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: