ఎయిర్పోర్టులోనే... చంద్రబాబు అలాగే నారా లోకేష్ లను అరెస్టు చేసే సంస్కృతి కూడా అప్పట్లో కనిపించింది. అడుగడుగునా టిడిపి పార్టీ నేతలకు వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్న అధికారులు కూడా పని చేశారు. పోలీసులు అలాగే... ఏసీబీ అధికారులు కూడా అలాగే వ్యవహరించడం జరిగింది. అయితే తెలుగుదేశం పార్టీ నేతలపై కుట్రలు చేస్తున్న నేపథ్యంలో అప్పట్లో నారా లోకేష్ పాదయాత్ర నిర్వహించారు.
ఇక ఈ పాదయాత్రలో పదే పదే రెడ్ బుక్ గురించి ప్రస్తావిస్తూ... వైసిపి నేతలకు వార్నింగ్ ఇచ్చారు నారా లోకేష్. అలాగే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అన్యాయంగా వ్యవహరించిన అధికారులకు కూడా హెచ్చరికలు జారీ చేశారు. అందరి పేరు రెడ్ బుక్ లో రాసుకున్నట్లు అప్పట్లోనే తెలిపారు నారా లోకేష్. అయితే.. నారా లోకేష్ అనుకున్నట్లుగానే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.
ఈ తరుణంలోనే రెడ్ బుక్ ఓపెన్ చేశారు నారా లోకేష్. అందులో గతంలో టిడిపి నేతలను ఎవరైతే వేధించారో వారందరినీ టార్గెట్ చేసి మరి నారా లోకేష్ చర్యలు తీసుకుంటున్నారని తెలుస్తోంది. వైసీపీ నేతలు అలాగే అప్పట్లో దారుణంగా వ్యవహరించిన అధికారులను టార్గెట్ చేసి కేసులు కూడా పెడుతుంది కూటమి ప్రభుత్వం. ఇలా రెడ్బుక్ ద్వారా నారా లోకేష్ మరింత పాపులర్ అవుతున్నారు.