ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయ్యి ఎనిమిది నెలలు కావొస్తోంది. తొలి ఆరు నెలల పాలనలో ఏయే నియోజకవర్గాల్లో ఎలాంటి అభివృద్ధి జరిగిందనేది చూస్తే కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు పట్టుబట్టి భారీగా నిధులు రప్పించి తమ నియోజకవర్గాల్లో అభివృద్ధికి బాటలు వేస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లాలోని గోపాలపురం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన మద్దిపాటి వెంకట్రాజు ఆరు నెలల్లోనే గోపాలపురం నియోజకవర్గంలో మంచి పనులతో తనదైన ముద్ర వేశారు.
గోపాలపురం నియోజకవర్గంలో కూటమి పాలనలో ఎమ్మెల్యే వెంకట్రాజు ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి పనుల వివరాలు ఇలా ఉన్నాయి..
1. పల్లె పండగ :
సుమారు 50 కోట్ల రూపాయలతో 85 పంచాయితీల్లో అభివృద్ధి మరియు మౌలిక వసతుల కల్పన.
2. సామాజిక భద్రత :
పింఛన్ల పంపిణి కార్యక్రమం ద్వారా 41,923 మందికి 130.25 కోట్లు ఇంటివద్దే లబ్దిదారులకు నేరుగా అందజేత.
3. సీఎం సహాయనిధి :
136 కుటుంబాలకు CMRF చెక్కుల రూపంలో మరియు ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి తక్షణ వైద్యం కోసం LOC ల రూపంలో సుమారు 2 కోట్ల రూపాయల ఆర్ధిక సాయం.
4. రైతే రాజు :
"వ్యవసాయం నిలవాలి - రైతు గెలవాలి" అనే నినాదంతో... గత ప్రభుత్వ ధాన్యం బకాయిలను చెల్లించడమే కాకుండా, ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో 46,020 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించిన 24 గంటల్లోనే 4,895 మంది రైతుల ఎకౌంట్లో 106 కోట్ల రూపాయలు జమ చేయడం జరిగింది.
- సూక్ష్మ సేద్య పథకం క్రింద మన ప్రభుత్వం 3087 మంది రైతులకు 19 కోట్ల 19 లక్షల రాయితీపై డ్రిప్పు మరియు స్ప్రింక్లర్ల పరికరాలను అందించింది.
- ఆయిల్ పామ్ సాగు చేసే 2916 మంది రైతులకు రూ. 5 కోట్ల 48 లక్షల గత ప్రభుత్వ బకాయిలను రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది.
5. విద్యా వ్యవస్థ ప్రక్షాళన :
రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి కొరకు ఆ శాఖ మాత్యులు శ్రీ నారా లోకేష్ గారి రథసారథ్యంలో విద్యా వ్యవస్థ సమూల ప్రక్షాళన మరియు విద్యార్థులకు సమతుల్య ఆహారం, పౌష్టికత కొరకు “డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజన పథకం” అమలు.
6. గ్రామ స్వరాజ్యం :
గౌరవ ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారి రథసారథ్యంలో గ్రామ పంచాయతీ వ్యవస్థ పునరుజ్జీవంతో గ్రామ స్వరాజ్యానికై అడుగులు.