టిడిపి పార్టీకి దశాదిశా మార్చినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది నారా లోకేష్ కు మాత్రమే చెందుతుందని చంద్రబాబు నాయుడు తర్వాత ఆయన సీఎం కావాలంటూ వ్యాఖ్యానించడం జరిగింది.. లోకేష్ చేపట్టిన యువ గళం పాదయాత్ర వల్లే టీడీపీకి పూర్వ వైభవం వచ్చిందని ఆయన వారసత్వ రాజకీయ నాయకుడు కాదని ప్రజలలో నుంచి పుట్టుకు వచ్చి ఎదిగిన నాయకుడే లోకేష్ అంటూ తెలియజేశారు. ఎన్టీఆర్ తర్వాత చంద్రబాబు తర్వాత నారా లోకేష్ వారసుడే అన్నట్లుగా తెలియజేయడం జరిగింది.
పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఎంతో అండగా లోకేష్ నిలబడ్డారని అందుకే ఈరోజు ఆయన పుట్టినరోజు చాలా గ్రాండ్ గా రాష్ట్రమంతట పలు ప్రాంతాలలో చేసుకుంటున్నారని తెలియజేశారు. అభిమానులు కూడా నారా లోకేష్ ని సీఎంగా చూడాలని విషయంపై 1000 కళ్ళతో ఎదురుచూస్తున్నారని తెలిపారు. ఇప్పుడు బుద్ధా వెంకన్న చేసిన ఈ వ్యాఖ్యలు మరొకసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మరి ఈ విషయంపై అటు టిడిపి నేతలు ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకొని రాబోయే ఎన్నికలలో లోకేష్ కి సీఎం స్థానాన్ని కల్పిస్తారేమో చూడాలి మరి. కానీ టిడిపిలోని కొంతమంది నేతలు జూనియర్ ఎన్టీఆర్కి సపోర్టివ్ గా వ్యవహరిస్తున్నారనే విధంగా గతంలో వార్తలు వినిపించాయి.. రాబోయే రోజుల్లో టిడిపి పార్టీ ఎవరి మీద ఆధారపడుతుందో చూడాలి.