శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఏపిలో ఐటి అభివృద్ధికి సహాయ, సహకారాలను అందించాలని మంత్రి నారా లోకేష్ కోరారు. ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేయబోతున్న వరల్డ్ క్లాస్ ఎఐ యూనివర్సిటీ సలహామండలిలో భాగస్వామ్యం వహించండి. మీ అమూల్యమైన సలహాలు మా రాష్ట్రంలో ఐటి అభివృద్ధికి దోహదం చేస్తాయి. ఎపిలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ హెల్త్ ఇన్నోవేషన్ అండ్ డయాగ్నోస్టిక్స్‌ను ఏర్పాటు చేయడానికి బిల్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ తరపున ఎపి ప్రభుత్వంతో భాగస్వామ్యం వహించాలని లోకేష్ కోరారు.
అలాగే రాష్ట్రంలోని ఇన్నోవేషన్ ఇంక్యుబేషన్ ఎకోసిస్టమ్‌ను నడపడానికి ఆఫ్రికాలో హెల్త్ డ్యాష్‌బోర్డ్‌ల తరహాలో సామాజిక వ్యవస్థాపకతలో ఫౌండేషన్ తరపున నైపుణ్య సహకారాన్ని అందించండి. దక్షిణ భారతంలో బిల్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ కార్యకలాపాలకు ఎపిని గేట్‌వేగా నిలపండి. మీ సహకారంత స్థానికంగా ఉత్పత్తులపై ప్రపంచ ఆవిష్కరణలను అమలు చేసేలా ఎపి ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి లోకేష్ విజ్ఞప్తిచేశారు. విజనరీ లీడర్ చంద్రబాబును చాలాకాలం తర్వాత కలవడం ఆనందంగా ఉంది, ఎపి ప్రభుత్వ ప్రతిపాదనలపై సహచరులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని బిల్ గేట్స్ చెప్పారు. ఈ చర్చల తర్వాత ఏపీలో ఐటీ రంగం పరంగా సరికొత్త శకం ఆవిష్కృతమవుతుందన్న అంచనాలు ఉన్నాయి.