పన్నుల పేరుతో ప్రభుత్వం ప్రజలను వేధించకుండా ప్రభుత్వం సొంతంగా సంపాదించుకునేందుకు ఇలాంటి పోర్టులు తయారు చేశారట మాజీ సీఎం జగన్. మెడికల్ కాలేజీ ల వల్ల ఆరోగ్యశ్రీని ఇందులో సబ్మిట్ చేస్తే రాబోయే రోజుల్లో ఆరోగ్యశ్రీ ఖర్చు తగ్గుతుందని కూడా ఆలోచించారట జగన్.. అయితే ఇదంతా కూడా ఒక సిస్టమాటిక్ వే లోనే జరిగిందట. చివరికి చంద్రబాబు నాయుడు దావోస్ లో ఏం చెప్పాల్సి వచ్చిందంటే.. గ్రీన్ పవర్ అన్నటువంటి అంశము.. ఇది జగన్ ప్రభుత్వంలో ఉన్నప్పుడే ఓకే అయినటువంటి ఒప్పందం.
అయితే వాటిని అప్పుడు కుంభకోణం అంటూ ఎద్దేవ చేశారు.. కాని చివరికి చంద్రబాబు నాయుడు ఇదే చెప్పుకోవాల్సి వచ్చింది. పోర్టులు ఆరోజు అనవసరంగా కడుతున్నారని ,అడ్డదిడ్డంగా కడుతున్నారనే విధంగా దోపిడీకి పెడుతున్నారనే విధంగా చాలామంది మాట్లాడారు. వాటికి అప్పులు తీసుకోవడం తప్పని చెప్పి వాదించారు. కానీ వీటి గురించి సీఎం చంద్రబాబు నాయుడు గొప్పగా ప్రశంసించినట్లు ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది. ప్రస్తుతం ఐదారు పోర్టులు ఉన్నాయి రాబోయే రోజుల్లో మరో రెండు మూడు పోర్టులు రాబోతున్నాయని తెలిపారట. రాబోయే రోజుల్లో ఆపోర్టు ప్రాంతమంతా ఒక నగరంగా అభివృద్ధి చెందుతుందని చెప్పారట. గత ఐదేళ్లలో జగన్ను దూషించి.. ఇప్పుడు జగన్ చేసిన పనిని దావోస్ లో చెప్పి అది తాము చేసుకున్నటువంటి పని అన్నట్టుగా స్థాయికి దిగిపోయారు.