ఆ తర్వాత వైసిపి పార్టీని వీడి మొన్న 2024 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో టిడిపి పార్టీ తరఫున అదే నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. అయితే అలాంటి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి... కొత్తగా దండయాత్ర చేస్తున్నారు. నెల్లూరు రూరల్ పరిధిలోని ప్రగతి నగర్ లో దోమల పై దండయాత్ర కార్యక్రమంలో పాల్గొన్నారు టీడీపీ పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఈ సందర్భంగా మురికి నీటిగుంటలో ఆయిల్ బాల్స్ వేసి మందును స్ప్రే చేసిన శ్రీధర్ రెడ్డి.. కీలక వ్యాఖ్యలు చేశారు.
నెల్లూరు రూరల్ పరిధిలో పలువురు దోమల వల్ల ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. అనారోగ్యానికి గురవుతూ ఆసుపత్రులకు లక్షలు వెచ్చించాల్సి వస్తోందని తెలిపారు. దోమలను నిర్మూలించేందుకు అధికారులు.. ప్రజలను భాగస్వామ్యం చేసేందుకే ఈ కార్యక్రమం చేపట్టామని తెలిపారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. త్వరలోనే నీటి గుంటలలో గంబోషియా చేపలను కూడా వదులుతామని హామీ ఇచ్చారు.
దోమల నిర్మూలనకు అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. దీనికే ప్రాధాన్యం ఇవ్వాలని.. అన్ని డివిజన్ లలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని గుర్తు చేశారు. నగరపాలక సంస్థలో పారిశుద్ధ సిబ్బంది తక్కువ ఉన్నారని తెలిపారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. అదనపు సిబ్బంది నియామకం పై మంత్రి నారాయణ చొరవ తీసుకోవాలని కోరారు.