అంతేకాదు మొన్న మొన్న కొత్తగా పార్టీలోకి వచ్చిన గూడెం మహిపాల్ రెడ్డి అనుచరులు నియోజకవర్గంలో రెచ్చిపోతున్నారని కూడా చెబుతున్నారు. అలాగే ప్రభుత్వ కార్యకలాపాలలో... గులాబీ పార్టీ నేతలకు ఎక్కువ ప్రాధాన్యత గూడెం మహిపాల్ రెడ్డి ఇస్తున్నాడని మండిపడుతున్నారు. అంతేకాకుండా ఆయన ఇంట్లో కెసిఆర్ ఫోటో పెట్టుకుని.. కాంగ్రెస్ కండువా వేసుకోకుండా... పార్టీకి నష్టం చేస్తున్నాడని గూడ మహిపాల్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ ముట్టడి చేశారు.
ఈ నేపథ్యంలో కేసీఆర్ ఫోటో తీసేసి ఆయన క్యాంప్ ఆఫీస్ లో రేవంత్ రెడ్డి ఫోటో పెట్టారు కాంగ్రెస్ నేతలు. దీనిపై గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బరాబర్ కెసిఆర్ ఫోటో పెట్టుకుంటానని.. పదేళ్లు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన గొప్ప నేత అని కొనియాడారు గూడెం మహిపాల్ రెడ్డి. దీంతో కెసిఆర్ పై కాంగ్రెస్ పార్టీలో ఉన్న గూడెం మహిపాల్ రెడ్డి కామెంట్స్ చేయడం హాట్ టాపిక్ అయింది. దీంతో ఆయన గులాబీ పార్టీలోకి మళ్లీ వెళ్తారని ప్రచారం జరుగుతోంది.