కూటమి ప్రభుత్వం ఏర్పడి అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమిలో కొన్నిచోట్ల గొడవలు జరుగుతూ ఉండగా మరికొన్నిచోట్ల సొంత పార్టీలోనే ఎమ్మెల్యేల పైన కార్యకర్తల పైన దాడి చేస్తూ ఉన్న సంఘటనలు మనం వింటూనే ఉన్నాము.. ఇప్పుడు తాజాగా గుంటూరు తూర్పు నియోజకవర్గం లో ఎమ్మెల్యేగా ఉన్న నజీర్ అహ్మద్ కు సొంత పార్టీ అయిన టిడిపి నేతలు నుంచి నిరసనలు మొదలవుతున్నాయట. దీంతో ఒక్కసారిగా అక్కడ ఆ ఎమ్మెల్యే పైన దాడి కూడా దిగడంతో ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ అంతట ఉలిక్కిపడేలా చేసింది.


అయితే తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అక్కడికి వెళ్లిన ఎమ్మెల్యే పైన ఒక వర్గం వారు ఫైర్ అయ్యారట. దీంతో ఇరువురి వర్గాల మధ్య ఒక వాద్వాదం నెలకొంది. దీంతో ఎమ్మెల్యే పైన ఒక వర్గం వారు దాడికి ప్రయత్నించారు.. వెంటనే ఈ విషయం తెలిసిన పోలీసులు అక్కడక్కసారిగా కంట్రోల్ ను చేతిలోకి తీసుకున్నారట. ముఖ్యంగా ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ పైన దాడి ఘటన ఒక్కసారిగా టిడిపి పార్టీని కలవర పాటకు గురిచేస్తుంది.


గుంటూరు నగర పరిధిలో ఉండేటువంటి ఒకటో నెంబర్ డివిజన్లో అక్కడ స్థానికంగా కార్యక్రమాలకు టిడిపి అధ్యక్షుడిగా సయ్యద్, ఇంతియాజ్ వ్యవహరిస్తూ ఉంటారట. అయితే ఈయన సోదరుడు ఫైరజ్ గత డివిజన్ ఎన్నికలలో టిడిపి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఈయన ప్రస్తుతం నగర టిడిపి ఉపాధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారట..ఎమ్మెల్యే ఒక ప్రైవేటు కార్యక్రమానికి హాజరు అయినప్పుడు అటు ఇంతియాజ్, ఫైరజు సోదరులకు తెలియకుండా ఎందుకు వచ్చారు అంటూ స్టేజ్ మీదే  హెచ్చరించేలోపు ఫైరజ్, ఇంతియాజ్ ఎమ్మెల్యే పైన దాడికి చేయడానికి ప్రయత్నం చేశారట. చొక్కా పట్టుకోవడంతో అక్కడున్న పోలీసులు చేరుకొని ఎమ్మెల్యేకు రక్షణ కల్పించినట్లు సమాచారం. ఈ ఘటనలు ఎమ్మెల్యేకు స్వల్ప గాయాలైనట్లుగా అక్కడ స్థానికులు తెలుపుతున్నారు. దీంతో ఒక్కసారిగా గుంటూరు జిల్లాలో తెలుగు తమ్ముల మధ్య విభేదాలు మరొకసారి బయటపడ్డాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: