ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ఇటీవలే దావోస్ పర్యటనలో భాగంగా వైసిపి మహిళ మాజీ మంత్రి ఆర్కే రోజా పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరు ముందుకు రావడంలేదనే విధంగా ఆరోపణలు చేశారు.. అలాగే ఐపీఎస్ అధికారుల పైన కూడా కేసులు పెట్టి వేధిస్తే ఎవరు వస్తారు అంటూ ప్రశ్నించింది. రాష్ట్రంలో అత్యాచారాలు ఎక్కువ అయ్యాయని రెడ్ బుక్ రాజ్యాంగమే ఆంధ్రప్రదేశ్ అంత నడుస్తోంది అంటూ పైరయ్యారు రోజా. గత ప్రభుత్వంలో శాంతిభద్రతాలు చాలా బాగున్నాయని తెలిపింది. ప్రజలు ఎక్కువగా రోడ్లమీద ధైర్యంగా నడిచే వారిని తెలిపింది..అయితే ప్రస్తుతం రోడ్డుమీద ప్రజలనే నరికేస్తున్నారంటూ ఫైర్ అయ్యింది రోజా.



లోకేష్, చంద్రబాబు వల్ల ఒక్క ఎంవోయూలు కూడా రాకపోవడం సిగ్గుచేటు అంటూ ఫైర్ అయ్యింది.. 20 కోట్లు ఖర్చుపెట్టి దావస్ కు వెళ్లి కేవలం ఉత్తి చేతులతో వచ్చారంటూ విమర్శించారు. స్పెషల్ ఫ్లైట్లు, సూటు, బూట్లు అంటూ కోర్ట్లు ఖర్చు పెట్టారు అంటు ఎద్దేవా చేసింది. ప్రధాన మోడీ ప్రారంభించిన ఎన్నో  ప్రాజెక్టులన్ని కూడా వైసిపి ప్రభుత్వం తీసుకొచ్చినవే అంటు తెలిపింది. చంద్రబాబు మత్తులో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఉన్నారంటూ వెల్లడించింది. మరి చంద్రబాబు పవన్ కళ్యాణ్ ను ఎందుకు అక్కడికి తీసుకు వెళ్ళలేదు అంటూ రోజా ప్రశ్నించారు.



చంద్రబాబు ఏడు నెలలలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు అంటే ఫైర్ అయ్యింది. తిరుమల పవిత్రతను పాడు చేశారని చంద్రబాబు అబద్ధాలు చెప్పడం మానేయాలి అంటు ఆమె వెల్లడించింది. తిరుమల తిరుపతిలో తొక్కిసలాటలు చనిపోయిన కుటుంబాలకు ఏ విధంగా సహాయం చేయకుండా గాలికి వదిలేశారు అంటూ రోజా ఫైర్ అయ్యారు. మొత్తానికి చంద్రబాబు అతని కుమారుడు వల్లే రాష్ట్రంలో ఎవరు కూడా పెట్టుబడులు పెట్టడానికి రావడం లేదనే విషయాన్ని తెలియజేసింది రోజా. ప్రస్తుతం రోజా చేసినటువంటి ఈ వాక్యలు వైరల్ అవుతున్నాయి

మరింత సమాచారం తెలుసుకోండి: