వైసీపీ పార్టీలో ఎంపీగా కీలక నేతగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి వైసీపీకి వెన్నుముక లాంటి వారిలో ఒకరని కూడా చెప్పవచ్చు.. అయితే తాజాగా తాను రాజకీయాలకు గుడ్ బై చెప్పబోతున్నట్లు ఇటీవల తన ట్విట్టర్ నుంచి ఒక విషయాన్ని తెలియజేయడం జరిగింది. ఈ విషయం విన్న వైసీపీ అభిమానులు నేతలు కూడా ఆశ్చర్యపోతున్నారు. అయితే తన రాజీనామాను రేపటి రోజున సమర్పించబోతున్నానంటూ తెలియజేయడం జరిగింది విజయసాయిరెడ్డి.


అంతేకాకుండా తాను ఏ పార్టీలోకి కూడా చేరడం లేదని వేరే పదవులలో ప్రయోజనాలో ఆశించి తాను రాజకీయాలకు దూరం కాలేదని ఈ నిర్ణయం తనకు పూర్తిగా వ్యక్తిగతమని ఎలాంటి ఒత్తిళ్లు  తనమీద లేవని ఎవరు తనమీద ఎలాంటి ప్రభావం చూపించలేదని తెలిపారు.. అలాగే నాలుగు దశాబ్దాలుగా మూడు తరాలుగా తనని నమ్మి ఆదరించిన ప్రజలకు అలాగే వైయస్ కుటుంబానికి కూడా రుణపడి ఉంటానని తెలియజేశారు విజయసాయిరెడ్డి. రాజ్యసభలో ఫ్లోర్ లీడర్ గా ఉండి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రయోజనాల కోసమే చాలా సిద్ధ శుద్ధిగా కృషి చేశారు. కేంద్రానికి రాష్ట్రానికి మధ్య వారధి లాగా కూడా పనిచేయడం జరిగింది విజయసాయిరెడ్డి.


సుమారుగా 9 సంవత్సరాలు ప్రోత్సహించి ఎంతో బలాన్ని ఇచ్చిన తెలుగు ప్రేక్షకులకు అలాగే ప్రధాన మోడీ ,అమిత్ షా గారికి ఎప్పటికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు అంటూ తెలిపారు అలాగే టిడిపి పార్టీతో తను రాజకీయంగా విభేదించినప్పటికీ చంద్రబాబు కుటుంబంతో వ్యక్తిగతంగా ఎలాంటి విభేదాలు లేవని తెలిపారు.. అలాగే పవన్ కళ్యాణ్ గారితో కూడా చిరకాల స్నేహం ఉందని తెలియజేశారు. ఇక రాబోయే రోజుల్లో తన భవిష్యత్తు కేవలం వ్యవసాయం అని తెలియజేశారు. ఈ సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఆదరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు అంటూ తెలియజేశారు విజయసాయిరెడ్డి. అయితే ఈ విషయం అటు వైసీపీ నేతలకు చాలా నిరుత్సాహపరిచేలా చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: