గులాబీ పార్టీ అధినేత, తెలంగాణ మొట్టమొదటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కు ఊహించని షాక్ తగిలింది. కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఇంట్లో... తీవ్ర విషాదం నెలకొంది. గులాబీ బాస్ కెసిఆర్ సొంత సోదరి మరణించారు. దీంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఐదవ సోదరి చీటీ సకలమ్మ అనారోగ్యంతో మరణించారు.


దాదాపు 88 సంవత్సరాలు ఉన్న చీటీ సకలమ్మ వయసు పైబడడంతో... హైదరాబాదులోని యశోద ఆసుపత్రిలో మరణించిన ట్లు వార్తలు వస్తున్నాయి. శుక్రవారం అర్ధరాత్రి... కెసిఆర్ సోదరి చీటీ సకలమ్మ మరణించారని అధికారిక ప్రకటన వచ్చింది. గత కొన్ని రోజులుగా ఆమె తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమెకు యశోద ఆసుపత్రిలో చికిత్స కూడా కుటుంబ సభ్యులు అందించారు.



అయితే ఆమె ఆరోగ్యం... నిన్న మరింత విషమించిందట. దీంతో అర్థరాత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సోదరి చీటీ సకలమ్మ అనారోగ్యంతో మరణించారు. ఇక.. ఆమె మరణించిన తర్వాత... మేడ్చల్ లోని ఆమె నివాసానికి మృతదేహాన్ని తరలించారు. ఇక ఈ వార్త తెలియగానే కల్వకుంట్ల చంద్రశేఖర రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హుటా హుటిన ఎర్రబెల్లి ఫామ్ హౌస్ నుంచి తన సోదరి ఇంటికి బయలుదేరారు కల్వకుంట్ల చంద్రశేఖర రావు.


మరణించిన చీటీ సకలమ్మ కొడుకు చీటీ నరసింహారావు... గులాబీ పార్టీ రాష్ట్ర నాయకులు అన్న సంగతి తెలిసిందే.  అటు చీటీ నరసింహారావు తల్లి చిట్టి సకలమ్మ... కేటీఆర్ కు మేనత్త అవుతారు. అయితే... చీటి సకలమ్మ మృతి నేపథ్యంలో ఇప్పటికే కేటీఆర్‌ కూడా మేడ్చల్‌ లోని ఆమె నివాసానికి చేరుకున్నారు. ఇక ఈ సంఘటన నేపథ్యంలో గ్రేటర్ పరిధిలోని BRS నేతల తో కేటీఆర్ నిర్వహించాల్సిన ఇవాళ్టి సమావేశం వాయిదా పడింది. త్వరలోనే తదుపరి తేదీ ప్రకటిస్తాం అని చెప్పారు కేటీఆర్.

మరింత సమాచారం తెలుసుకోండి:

KCR