నిన్నటి రోజున వైసిపి సీనియర్ నేత ఎంపీ విజయసాయిరెడ్డి రాజకీయాలకు గుడ్ బై చెప్పుతున్నానని విషయాన్ని ప్రకటించడంతో అందరూ ఆశ్చర్యపోయారు.. అయితే ఇలా రాజకీయాలకు నుంచి తప్పుకోబోతున్నారని తెలియడంతో చాలా మంది బిజెపి పార్టీలో చేరబోతున్నారనే విధంగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే మొన్నటి వరకు ముగ్గురు ఎంపీలు రాజీనామా చేశారు.. మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్రావు, బీసీ సంఘాల అధ్యక్షుడు కృష్ణయ్య. బీద మస్తాన్రావు సీటు బీద మస్తాన్ రావు కొనసాగించారు.. కృష్ణయ్య సీటు బిజెపి పార్టీ నుంచి తన స్థానాన్ని కొనసాగించారు.. అలాగే విజయ్ సాయి రెడ్డికి మోడీ, అమిత్ షాకు మంచి స్నేహబంధం ఉన్నది.


అందుకే ఇంతవరకు మోది, అమిత్ షా చేసినటువంటి సహాయ సౌకర్యాలకు ధన్యవాదాలు కూడా ప్రకటించారు విజయసాయిరెడ్డి. వీటితో పాటుగా చంద్రబాబు నాయుడుతో వ్యక్తిగతమైన విభేదాలు లేవని, పార్టీపరంగా విభేదించారని.. అలాగే తారకరత్న మరణించినప్పుడు కూడా నందమూరి కుటుంబంతో పాటుగా చంద్రబాబు నాయుడు కూడా అక్కడికి రావడంతో కొన్ని విషయాల గురించి చర్చించడం జరిగింది. అలాగే పవన్ కళ్యాణ్ గారంటే తనకి కూడా గౌరవమని మా ఇద్దరి మధ్య స్నేహబంధం అలాగే ఉందని తెలిపారు.. కూటమికి సంబంధించి ముగ్గురిని కూడా పాజిటివ్ గానే మాట్లాడారు.



ప్రస్తుతం బిజెపి పార్టీకి రాజ్యసభ సభ్యుల కావాలి కాబట్టి.. వైసీపీ పార్టీ నుంచి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీ నుంచి రాజ్యసభ సభ్యుడుగా ఎన్నికవ్వడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయనే ప్రశ్న మిలియన్ డాలర్లగా మిగిలిపోయింది.. మరి విజయ్ సాయి రెడ్డి ఏం చేస్తారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే విషయం తెలియాల్సి ఉన్నది.. అయితే తాను మాత్రం రాజకీయాలకు దూరంగా ఉంటానని కేవలం వ్యవసాయమే చేసుకుంటానంటూ తెలియజేశారు.. మరి పార్టీ మారుతారు అనే విషయం మాత్రం కేవలం రూమర్సే అన్నట్లుగా కొంతమంది నేతలు తెలియజేస్తున్నారు. మరి అసలు విషయం ఏంటన్నది మరో కొద్ది రోజులలోనైనా తెలియబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: